ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-27 03:56:37

ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ‌

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్ల‌డంలో ముందుంటారు ఎంపీ అవినాష్ రెడ్డి.... ప్ర‌జ‌లు అప్ప‌గించిన‌టువంటి ఎంపీ ప‌ద‌విని గ‌త నాలుగేళ్లుగా బాధ్య‌త‌గా నిర్వ‌ర్తిస్తున్నారు ఎంపీ  అవినాష్ రెడ్డి. ముఖ్యంగా క‌డ‌ప జిల్లా స‌మ‌స్య‌ల‌పై నిత్యం అప్ర‌మ‌త్తంగా ఉండి, వాటి ప‌రిష్కారానికి చొర‌వ చూపుతుంటారు వైయ‌స్ అవినాష్ రెడ్డి. తాజాగా వేముల మండలం మబ్బుచింతలపల్లి గ్రామ పరిధిలో ఏర్పాటైన యురేనియం కారాగారం వ‌ల్ల వ‌స్తున్న ఇబ్బందుల‌ను ప‌రిష్క‌రించాలంటూ ప్ర‌ధాని మోదీకి లేఖ రాశారు.
 
యురేనియం టైల్‌పాండ్‌ వ‍్యర్థాల వల్ల ఏడు గ్రామాల ప్రజలకు ఆరోగ్య సమస్యలు వస్తుండ‌డంతో ఆ ప్రాంతాల ప్ర‌జ‌లు తీవ్రంగా బాధ‌ప‌డుతున్నార‌ని పేర్కొన్నారు. అలాగే పంటలు, పశు సంపద సైతం దెబ్బతింటోదని, ఈ స‌మ‌స్య‌ల‌కు వీలైనంత త్వ‌ర‌గా పరిష్కారం చూపాలని....ఆల‌స్యం చేస్తే క్ర‌మంగా బాధితులు అధికం అవుతార‌ని వైయ‌స్ అవినాష్‌ రెడ్డి తన లేఖలో ప్రధానికి విజ్ఞప్తి చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.