అవినాష్ రెడ్డి సంచ‌ల‌న స‌వాల్ ఎనీ సెంట‌ర్ ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

mp avinashreddy
Updated:  2018-03-02 10:52:28

అవినాష్ రెడ్డి సంచ‌ల‌న స‌వాల్ ఎనీ సెంట‌ర్ ?

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ క‌డ‌ప ఎంపీ వైయ‌స్ అవినాష్ రెడ్డి తెలుగుదేశం నాయ‌కుల‌కు స‌వాల్ విసిరారు..  ఆయ‌న తాజాగా విసిరిన స‌వాల్ అనే అస్త్రం తెలుగుదేశం నాయ‌కుల‌ను బెంబేలెత్తిస్తోంది.. దివంగ‌త సీఎం రాజ‌శేఖ‌ర్ రెడ్డి హ‌యాంలో, పులివెందుల‌లో జ‌రిగిన అభివృద్దిని నిరూపించ‌డానికి తాను రెడీ అని అన్నారు. ఎప్పుడు ఏ సెంట‌ర్ కు రావాలి, స‌మ‌యం మీరు చెప్ప‌మన్నా, ప్లేస్ మీరు చెప్పినా, న‌న్ను చెప్ప‌మ‌న్నా చ‌ర్చ‌కు రెడీ అన్నారు ఎంపీ అవినాష్ రెడ్డి.
 
వైయ‌స్ ఆర్ చేసింది చెప్పే ద‌మ్ము త‌మ‌కు ఉంద‌ని అన్నారు వైయ‌స్ అవినాష్ రెడ్డి..వైఎస్‌ఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలను కొనసాగిస్తున్న టీడీపీ ప్రభుత్వం, సవాల్‌ విసరడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు వైఎస్‌ఆర్‌ చలవేనని అన్నారు ఎంపీ అవినాష్ రెడ్డి.
 
రాష్ట్రంలో అప‌ర‌భ‌గీర‌ధుని వ‌లే సాగునీటి ప్రాజెక్టు ప‌నుల‌ను 80 శాతం పూర్తి చేసిన ఘ‌న‌త వైయ‌స్సార్ దే అని అన్నారు అవినాష్ రెడ్డి... ఇప్పుడు అధికారంలోకి వ‌చ్చి మిగిలిన 20 శాతం ప‌నులు పూర్తిచేసి ఆ క్రెడిత్ మీ ఖాతాలో వేసుకుంటున్నారు అని, కొన్నిటికి  ఆ20 శాతం నిధులు కూడా కేటాయించ‌కుండా ప్రాజెక్టుల‌ను ప‌క్క‌న పెడుతున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు.. నిజంగా చంద్రబాబు చిత్త‌శుద్ది ఉంటే దీనిపై నాయ‌కుల‌ను చ‌ర్చ‌కు పిల‌వాలి అని అన్నారు అవినాష్ రెడ్డి.అందుకే టీడీపీ నేతల సవాల్‌ను తాను స్వీకరిస్తున్నానని, బహిరంగ చర్చకు సెంటర్‌ టీడీపీ నేతలు డిసైడ్‌ చేస్తే...తాను రావడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. దీంతో స‌వాల్ చేసిన తెలుగుదేశం నాయ‌కులు నేడు ఏమీ మాట్లాడ‌కుండా మౌనంగా ఉన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.