చంద్ర‌బాబు పై జేసి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

mp jc diwakar reddy sensational comments on chandrababu
Updated:  2018-03-02 02:14:44

చంద్ర‌బాబు పై జేసి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు...ప్ర‌ధాని మోదీ, అమిత్‌షా ఉచ్చులో చంద్రబాబు చిక్కుకున్నారని వ్యాఖ్యానించారు.  హోదా బదులు ప్యాకేజీ ఇస్తామంటే పెద్దమనిషి కాబట్టి ఒప్పుకున్నారు, అప్పుడు అలాగ జ‌రిగింది అని అన్నారు జేసి దివాక‌ర్ రెడ్డి.
 
ఇక ప్ర‌త్యేక హూదా మాట ప‌క్క‌న పెట్టి,  ప్ర‌త్యేక ప్యాకేజీ అన్నారు.. అది కూడా కేంద్రం ఇవ్వ‌డం లేదు అని ఆయ‌న మండిప‌డ్డారు...ఈ సారి కేంద్రం వైఖ‌రితో  త‌లొగ్గేది లేదు అని జేసి ఫైర్ అయ్యారు..ఇతర రాష్ట్రాలకు ఇస్తే ఏపీకి హోదా ఇవ్వాల్సిందే అని తేల్చి చెప్పారు... ఉప రాష్ట్ర‌ప‌తి గా ఉన్న వెంక‌య్య‌నాయుడు త‌ల‌చుకుంటే ఏమైనా జ‌రుగుతుంది అని అన్నారు.. ఇక ఏపీకి న్యాయం జ‌రిగే వ‌ర‌కూ పార్ల‌మెంట్లో ఆందోళ‌న‌ చేస్తామ‌ని అన్నారు జేసి దివాక‌ర్ రెడ్డి. 
 
రాజీనామాలు, అవిశ్వాస తీర్మానాలతో ఒరిగేదేమీలేదని ఎంపీ జేసీ వెల్ల‌డించారు.  ప్రజలు కేంద్రం నుంచి బయటికి రావాలని కోరుకుంటున్నారని...అయితే తాము బయటికి వచ్చినా ప్రభుత్వం పడిపోదని అన్నారు... అలాగే  జేసి వ్యాఖ్య‌లు చంద్రబాబును ఇరికించేలా ఉంటున్నాయి... పోల‌వ‌రం నిధులా, లేక ఓటుకునోటు అంశ‌మా ఏ ఉచ్చుల్లో బాబు చిక్కుకున్నారో తెలియ‌చేయాలి.. అలాగే ప్ర‌త్యేక హూదా కోసం ఎంపీలు రాజీనామా చేస్తే ఒరిగేది ఏమీ లేదు అని మీరు చెప్ప‌డం కంటే, ప్ర‌జ‌ల‌కు తెలుస్తుంది గా ఓ సారి రాజీనామా  చేస్తే అనే వాద‌న వినిపిస్తోంది.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.