చంద్ర‌బాబుకు ఆ స‌ల‌హా ఇచ్చా?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

jc divakar reddy and nara chandrababu naidu
Updated:  2018-04-16 04:23:34

చంద్ర‌బాబుకు ఆ స‌ల‌హా ఇచ్చా?

ఏపీలో తెలుగుదేశం బీజేపీ మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే కార్చిచ్చులా దావాలంలా మండిపోతోంది... ఏపికి చాలా చేశాం తెలుగుదేశం అబద్దాలు చెబుతోంద‌ని బీజేపీ అంటుంటే, ఇటు తెలుగుదేశం ఎటువంటి సాయం బీజేపీ చేయ‌లేదు అని విమ‌ర్శ‌లు చేసి  తిప్పికొడుతోంది.తెలుగుదేశం చెప్పేవి అన్ని అబ‌ద్దాలు అని బీజేపీ అంటుంటే బీజేపీ లెక్క‌లు అన్ని త‌ప్పు అని అంటున్నారు తెలుగుదేశం నాయ‌కులు.
 
ఇక నిరంత‌రం వార్త‌ల్లో ఉండే అనంత‌పురం ఎంపీ జేసి దివాక‌ర్ రెడ్డి తెలుగుదేశం అధినేత సీఎం చంద్ర‌బాబు పై ఎప్పుడూ త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌ప్ర‌సంశ‌ల‌తో పంచ్ లు వేస్తారు.. అయితే తెలుగుదేశం ఎటువంటి సాయం కేంద్రాన్ని అడిగినా ఏపీ త‌ర‌పున ఎటువంటి నిధులు కావాలి అని అడిగినా కేంద్రం సాయం చేయ‌లేద‌ని, కేవ‌లం బీజేపీ త‌ప్పుడు లెక్క‌లు కాగిత‌పు మాట‌లు మాత్ర‌మే చెబుతోంది అని జేసి దివాక‌ర్ రెడ్డి విమ‌ర్శించారు.
 
ఇక ఏపీకి రూ.19వేల కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్న బీజేపీ ఎంపీ హరిబాబు వ్యాఖ్యలపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు... బీజేపీ అధ్య‌క్షుడు ఎంపీ హరిబాబు వ్యాఖ్యలు శుద్ధ అబద్ధమని అన్నారు. ఏపికి నిధుల రూపంలో డబ్బులు ఇస్తామంటే తానే వెళ్లి సీఎం చంద్ర‌బాబుతో  మాట్లాడతానని ఆయన తెలిపారు. 
 
మీకాగితాల మీద లెక్కలను జనం నమ్మరని ఎంపీ చెప్పుకొచ్చారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు విషయంలో ప్రధాని మోదీ మెడలు వంచినా సరే ఆంధ్రప్రదేశ్‌కు ఏమీ చేయరని తేల్చిచెప్పారు... హోదా కోసం ఢిల్లీలో పోరాడాలని చంద్రబాబుకు చెప్పానని... ఆయన ఏం చేస్తారో వేచి చూడాలని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. అయితే మొత్తానికి తెలుగుదేశం అధినేత ఎటువంటి ఆదేశాలు ఎంపీల‌కు ఇచ్చినా తూచా త‌ప్ప‌కుండా ఎంపీలు పాటిస్తాం అని గ‌తంలో ఎంపీ జేసి చెప్పుకొచ్చారు.... ఇప్పుడు సీఎం చంద్ర‌బాబుకు దిల్లీలో పోరాడాల‌ని చెప్పిన జేసి మాట చంద్ర‌బాబు వింటారా అక్క‌డ ఎటువంటి దీక్ష చేస్తారు అనేది చూడాలి మ‌రి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.