జ‌గ‌న్ ని మెచ్చుకున్న జేసి దివాక‌ర్ రెడ్డి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-14 11:07:39

జ‌గ‌న్ ని మెచ్చుకున్న జేసి దివాక‌ర్ రెడ్డి

రాజ‌కీయంగా ఆరితేరిన తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబుకు గ‌ట్టి పోటీ జ‌గ‌న్ ఇవ్వ‌లేడు అని, తెలుగుదేశంలో కొంద‌రు సీనియర్లు అనేక మార్లు మీడియా ముఖంగా అనేవారు.. ఇక్క‌డ తెలివి తేట‌లు కాదు, ఎప్పుడు ఎవ‌రు స‌రైన నిర్ణ‌యం తీసుకుంటే వారే కింగ్ అవుతారు.. స‌మ‌యం బ‌ట్టీ రాజ‌కీయంగా పావులు క‌ద‌పాలి.. అయితే నాలుగు సంవ‌త్స‌రాలు ప్ర‌తిప‌క్షంలో ఉన్న జ‌గ‌న్ కు తెలుగుదేశం ఆడే రాజ‌కీయ చ‌ద‌రంగం అన్ని స్టెప్స్ అవ‌లీల‌గా తెలిసిపోయాయి.. స్పీక‌ర్ ఫార్మెట్ రాజీనామాల‌కు ఏనాడు తెలుగుదేశం రెడీ కాదు, అయితే రాజీనామా అనే మాట తెలుగుదేశం పార్టీ కాంపౌండ్ నుంచి వినిపించ‌దు.. కాని వైసీపీ అధినేత జ‌గ‌న్ అనేక సార్లు త‌మ ఎంపీలు రాజీనామా చేస్తారు అని తెలియ‌చేశారు. చివ‌ర‌కు ఏప్రియ‌ల్ ఆరు డెడ్ లైన్ విధించారు జ‌గన్  కేంద్రానికి.
 
ఏపీకి ప్ర‌త్యేక హూదా ఇవ్వ‌క‌పోతే త‌మ ఎంపీలు రాజీనామా చేస్తార‌ని, ఆర‌వ తేదిన రాజీనామా చేసి రాష్ట్రానికి వ‌స్తారు అని చెప్పారు.. ఇక్క‌డ వ‌ర‌కూ బాగానే ఉన్నా, టెక్నిక‌ల్ గా... ఎంపీలు - ఎమ్మెల్యేలు ఎవ‌రైనా రాజీనామా చేస్తే,  ఆరునెలల్లో ఆ స్దానాన్నీ భ‌ర్తీ చేయాలి.. అయితే ఎన్నిక‌లకు సంవ‌త్సరం సమ‌యం ఉంటే, అక్క‌డ ఉప ఎన్నిక‌ల‌కు -ఎన్నిక‌ల సంఘం గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌దు.. దీంతో ఇక్క‌డ ఉప ఎన్నిక వ‌చ్చే ఛాన్స్ లేదు.. రాజీనామా అస్త్రం ప్ర‌యోగించి తెలుగుదేశాన్ని అడ‌క‌త్తెర‌లో పోక‌చెక్క‌లా ఇరుకున పెట్టారు జ‌గ‌న్. 
 
దీనిపై అనంత‌పురం ఎంపీ జేసి దివాక‌ర్ రెడ్డి స్పందించారు.. జ‌గ‌న్ చాలా తెలివైన వాడు అని ప్ర‌సంసించారు.. న‌వంబ‌ర్ లో ఎన్నిక‌లు వ‌స్తే ఇక  ఏడు నెల‌ల స‌మ‌యం మాత్ర‌మే ఉంటుంది.. పైగా ఈ రాజీనామాలు ఆమోదం చెందాలి అంటే మ‌రో రెండు నెల‌ల స‌మ‌యం ప‌డుతుంది అని జేసి అన్నారు.. అయితే దీనిపై తెలుగుదేశం మాత్రం త‌న వెర్ష‌న్ చెప్ప‌డం లేదు. వైసీపీ నాయ‌కుల‌పై విమ‌ర్శ‌ల తోనే మీడియా స‌మావేశాల‌ను కానిచ్చేస్తున్నారు తెలుగుత‌మ్ముళ్లు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.