వైసీపీ టీడీపీ పై ఎంపీ క‌విత‌ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-19 12:31:54

వైసీపీ టీడీపీ పై ఎంపీ క‌విత‌ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విభ‌జ‌న చట్టంలో పొందుప‌రిచిన ప్ర‌త్యేక హోదా కోసం నాలుగు సంవ‌త్స‌రాలుగా కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తో పోరాడుతున్నసంగ‌తి తెలిసిందే.
 
అంతేకాదు త‌న పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి, మేక‌పాటి రాజ‌మోహ‌న్, వైవీ సుబ్బారెడ్డి, వ‌ర‌ప్ర‌సాద్ రావుల‌తో  దేవాలాయం అయిన‌టువంటి పార్ల‌మెంట్ స‌మావేశాల్లో అవిశ్వాస తీర్మానం పెట్టించి వారి ప‌ద‌వులకు రాజీనామా చేయించిన ఘ‌నత వైస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి మాత్ర‌మే ద‌క్కుతుంది. ప్ర‌త్యేక హోదాపై వైసీపీ నాయ‌కుల‌కు ఉన్న‌టువంటి చిత్తశుద్దిని చూసి రాష్ట్ర ప్ర‌జలే కాకుండా ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన రాజ‌కీయ నాయ‌కులు కూడా గ‌ర్విస్తున్నారు. 
 
అందులో భాగంగానే వ‌ర్షాకాల పార్ల‌మెంట్ స‌మావేశం త‌ర్వాత‌ తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూమార్తె, ఎంపీ క‌విత ప్ర‌త్యేక హోదాపై మీడియా ద్వారా స్పందించారు. విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన ప్ర‌త్యేక హోదా ఏపీ హ‌క్కుని అమె స్ప‌ష్టం చేశారు. హోదా కోసం ప్ర‌తిప‌క్ష‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు మాత్ర‌మే చిత్తశుద్దితో ప‌ని చేశారని అమె అన్నారు. ఇందుకోసం వైసీపీ ఎంపీలు త‌మ ప‌ద‌వులను త్యాగం చేశార‌ని పేర్కొన్నారు. అంతేకాదు వారు రాజీనామా చేసినా కూడా వ‌ర్షాకాల స‌మావేశాల స‌మ‌యంలో పార్ల‌మెంట్ ముందు నిర‌స‌న‌లు తెలుపుతున్నార‌ని అన్నారు. 
 
వైసీపీ ఎంపీలు అనుకున్నది అనుకున్న‌ట్లుగానే రాజీనామా చేశార‌ని, దీంతో ప్ర‌జ‌ల్లో వారిపై మ‌రింత విశ్వాసం పెరిగింద‌ని అన్నారు. అయితే అధికార తెలుగుదేశం పార్టీ ఎంపీల్లో ఆ ప‌ట్టుద‌ల క‌నిపించ‌డంలేద‌ని ఆమె మండిప‌డ్డారు. టీడీపీ ఎంపీలు ఇప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టినా కూడా అది చ‌ర్చ‌కు రాద‌ని క‌విత‌ స్ప‌ష్టం చేశారు. మొన్న‌టి వ‌ర‌కూ బీజేపీతో క‌లిసి ఉన్న నాయ‌కులు ఇప్పుడు హ‌డావుడి చేస్తున్నారు అని ఆమె విమ‌ర్శించారు. గ‌త పార్ల‌మెంట్ స‌మావేశాల్లో తెలంగాణ అంశాల‌పై స‌రిగ్గా పోరాటం చేయ‌లేద‌ని కానీ ఈ స‌మావేశాల్లో తెలంగాణకు సంబంధించిన అన్ని అంశాల‌ను గురించి పోరాటం చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. అంతేకాదు తాము జ‌మిలి ఎన్నిక‌ల‌కు సిద్ద‌మ‌ని పేర్కొన్నారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.