మిథున్ రెడ్డి పిలుపు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp mp mithun reddy
Updated:  2018-03-30 04:14:46

మిథున్ రెడ్డి పిలుపు

ఏపీ ఎంపీలు అంద‌రూ క‌లిసి కేంద్రం పై తిర‌గ‌బ‌డాలి అని ఏపీకి ఇచ్చిన హామీలు సాధించుకోవాలి అని తెలియ‌చేశారు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి.. హోదా పోరాటం కీలక దశలో ఉందని, హోదా కోసం ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చారని, ఇది శుభపరిణామం అని ఆయన అన్నారు...ఏపీకి ప్ర‌త్యేక హూదా సాధ‌నే ల‌క్ష్యంగా వైసీపీ పోరాటం చేస్తోంది అని ఆయ‌న తెలియ‌చేశారు.
 
తాము స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామాలకు సిద్ధంగా ఉన్నామని, చిత్తశుద్ధి ఉంటే టీడీపీ కూడా తమతో కలిసి రావాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో కూర్చుని అఖిలపక్షం పెడితే లాభం లేదని, అందరం కలిసి రాజీనామాలు చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని మిథున్‌ రెడ్డి సూచించారు.
 
అమ‌రావ‌తిలో నిర్ణ‌యాలు తీసుకుంటే హ‌స్తిన‌లో ప‌నులు అవ్వ‌వు అని ఆయ‌న అన్నారు.. రాష్ట్రానికి అన్యాయం జ‌రిగింది అని 25 మంది ఎంపీలు రాజీనామా చేస్తే క‌చ్చితంగా ఇది దేశంలో చ‌ర్చ‌కు వ‌స్తుంది అని రాజకీయంగా ప్ర‌కంప‌న‌లు వ‌స్తాయి అని ఆయ‌న తెలియ‌చేశారు... అప్ప‌డు కేంద్రం దిగి వ‌చ్చి ఏపీకి ఇవ్వ‌వ‌ల‌సిన‌ ప్ర‌త్యేక హూదా వ‌స్తుంది అని అన్నారు ఆయ‌న‌.
 
అంద‌రూ క‌లిసి రాజీనామాలు చేస్తే క‌చ్చితంగా ఉప ఎన్నిక‌లు వ‌స్తాయి ఆ స‌మ‌యంలో కేంద్రం త‌మ నిర్ణ‌యాన్ని మార్చుకుంటుంది అని అన్నారు...రాజస్థాన్‌, కర్ణాటకలోనూ అలాగే జరిగిందని, రాష్ట్ర ప్రజయోజనాల కోసం పదవులు వదులుకోవడానికి తాము సిద్ధమని స్ఫష్టం చేశారు. అందుకే తెలుగుదేశాన్ని కూడా త‌మ‌తో క‌లిసి రావాల‌ని పిలుపునిస్తున్నాం అని అన్నారు.
 
త‌మ పార్టీ అధినేత అవిశ్వాసం పై నిర్ణ‌యం తీసుకోవ‌డంతో సంచ‌ల‌నం క్రియేట్ అయింద‌ని... అన్ని పార్టీలు ఇప్పుడు ఇదే పందాలో ముందుకు వెళుతున్నాయి అని అన్నారు మిథున్ రెడ్డి. తెలుగుదేశం ఎంపీలు రాజీనామా చేయ‌క‌పోతేలాలూచీ ప‌డిన‌ట్టే అని అన్నారు.వైఎస్‌ జగన్‌ ముందుగా ప్రకటించినట్లే తాము ఏప్రిల్‌ 6వ తేదీన రాజీనామాలకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఒకవేళ టీడీపీ ఎంపీలు అంతకంటే ముందే రాజీనామాలు చేసినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. వారి రాజీనామాలు చేశాక తాము చేస్తామని తెలిపారు. సోమ‌వారం అవిశ్వాసం పై చ‌ర్చ జ‌రుగుతుంది అని విశ్వాసంగా ఉన్నాము అని తెలిపారు మిథున్ రెడ్డి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.