వాళ్ల‌కు ప‌ట్టిన గ‌తే మీకు ప‌డుతుంది

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-07 11:58:25

వాళ్ల‌కు ప‌ట్టిన గ‌తే మీకు ప‌డుతుంది

ఏపీలో తెలుగుదేశం వైసీపీ నాయ‌కులు బ‌డ్జెట్ లో జ‌రిగిన న‌ష్టాన్ని నిల‌దీస్తూ పార్లమెంట్ల ఉభ‌య‌స‌భ‌ల్లో త‌మ గ‌ళాన్ని వినిపిస్తున్నారు...సేవ్ ఏపీ అంటూ ప్ల‌కార్డులు చూపుతున్నారు... కాంగ్రెస్ ఏపీని విభ‌జిస్తే బీజేపీ ఏపీ అభివృద్దికి కంక‌ణం క‌ట్టుకోలేద‌ని విమ‌ర్శిస్తున్నారు.. ఓ ప‌క్క టీడీపీ ఎంపీలు మోదీ కేంద్ర‌మంత్రుల‌తో స‌మావేశాలు అయ్యి చేతులేత్తేస్తే ఇటు వైసీపీ ఎంపీలు త‌మ వైఖ‌రిని చూపుతూనే ఉన్నారు ఏపికి న్యాయం చేయాలి అని.
 
ఏపీ ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు పార్లమెంట్‌  ఉభయ సభల్లో గొంతెత్తి నినదించారు.విభజన చట్టంలోని హామీలన్నీ అమలు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. పార్లమెంట్‌ సమావేశాలను స్తంభింపజేశారు. కర్నాట‌క  రాష్ట్రంలో బెంగళూరు కి  మెట్రో నిధులు ఇచ్చార‌ని, కాని విజయవాడ,విశాఖపట్నంకు ఎందుకు ఇవ్వలేదు అని రాజం పేట ఎంపీ మిథున్ రెడ్డి ప్ర‌శ్నించారు... అయితే  ఈఏడాది ఎన్నిక‌లు ఉన్న సంద‌ర్బంగా అక్క‌డ నిధుల కేటాయింపు జ‌రిగింది అనే విమ‌ర్శ‌లు వ‌స్తూనే ఉన్నాయి అందుకే క‌ర్నాట‌క పై మ‌ళ్లీ క‌మ‌లం విక‌సించేలా బీజేపీ ప్లాన్ వేస్తోంది అని అంటున్నారు కాంగ్రెస్ నాయ‌కులు.
 
ఈ సందర్భంగా లోక్ సభలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని కళ్లకు కట్టేలా వివరించారు రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి.... ఏపీకి ఇచ్చిన హామీల  అమలుపై కేంద్ర బడ్జెట్‌లో ప్రస్తావనే లేదని ఆయ‌న  ప్ర‌శ్నించారు.. తెలుగుదేశం పార్టీ కేంద్రంలో ఉండి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు ఇప్పటిదాకా ఏం చేసిందో చెప్పాలన్నారు..?
 
వారి స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని... హామీలను అమలు  చేసేలా ఈ బడ్జెట్‌ సమావేశాల్లో కేంద్రంపై ఒత్తిడి తెస్తామ‌న్నారు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చకపోతే ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో  కాంగ్రెస్  కు ప‌ట్టిన గ‌తే బీజేపీ కి ప‌డుతుంద‌ని ఆయ‌న ఆన్నారు. కేంద్రం స్పందించేంత వరకూ మా ఒత్తిడి, పోరాటం కొనసాగుతుందని ఫైర్ అయ్యారు.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.