అఖిల‌కు షాక్ ఇచ్చిన ఎస్పీవై రెడ్డి?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-03 18:48:45

అఖిల‌కు షాక్ ఇచ్చిన ఎస్పీవై రెడ్డి?

రాయ‌ల‌సీమ రాజ‌కీయాలన్ని ఒకఎత్తు అయితే.. నంద్యాల రాజ‌కీయాలు మాత్రం స‌ప‌రేటు.. భూమా నాగిరెడ్డి అకాల మ‌ర‌ణంతో అక్క‌డి రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారాయ‌న‌డంలో ఏ మాత్రం సందేహం లేదు.... అయితే దీనికి ప్ర‌త్య‌క్ష సాక్షం గ‌త కొద్దిరోజుల క్రితం జ‌రిగిన ఉపఎన్నిక‌లే కార‌ణం అని చెప్పుకోవాలి...ఈ ఉపఎన్నిక‌ల్లో అధికార‌మే ల‌క్షంగా చేసుకుని తెలుగుదేశం పార్టీ నాయ‌కులు మొత్తం తిష్ట‌వేసి త‌మ‌కున్న స్ట్రెంత్ తో వైసీపీ ప్ర‌త్య‌ర్థి శిల్పామోహ‌న్ రెడ్డిని ఓడించి, టీడీపీ అభ్య‌ర్థి భూమా బ్ర‌హ్మ‌నంద‌రెడ్డిని  గెలిపించిన సంగ‌తి తెలిసిందే. 
 
అయితే ఈ  ఎన్నిక‌లు జ‌రిగి సంవ‌త్స‌రం కాకుండానే  నంద్యాల‌లో తెలుగు దేశంలో లుక‌లుక‌లు మొద‌ల‌య్యాయి.... ఇంకా 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లకు సుమారు ఏడాది  వ్య‌వ‌ది ఉన్నా, త‌మ ఫ్యూచ‌ర్ రాజ‌కీయాల దృష్ట్యా  రెండు వ‌ర్గాలుగా విడిపోయి టీడీపీ నాయ‌కులు నంద్యాల‌లో వ్య‌వ‌హ‌రిస్తున్నారు.. అయితే ఈ వ‌ర్గ‌పోరు కాస్త ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు దృష్టికి చేర‌డంతో నంద్యాల రాజ‌కీయం మ‌రింత హాట్ హ‌ట్ గా సాగుతోంది.
 
ఈ నేప‌థ్యంలో 2019 ఎన్నికల్లో టీడీపీ త‌ర‌పున తమ కుటుంబానికి ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు రెండూ ఇవ్వాలంటూ నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి ముఖ్య‌మంత్రిని కోరిన‌ట్లు తెలియ‌చేశారు....గ‌త ఉప ఎన్నిక‌ల్లో ఎస్పీవై రెడ్డి కుటుంబానికి టీడీపీ టికెట్ ఇస్తుంది అని అనుకున్నారు కాని భూమా ఫ్యామిలీకి ఆ సీటు ద‌క్కింది... త‌ర్వాత  కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవిపై ఆశ‌లు పెట్టుకున్న ఎస్పీవైరెడ్డి కుటుంబానికి  చంద్ర‌బాబు హ్యాండిచ్చారు..ఆ  సీటు కూడా ఉప ముఖ్య‌మంత్రి సోద‌రుడు మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ కు ఇచ్చారు.
 
దీంతో ముంద‌స్తు జాగ్ర‌త్త‌తో సార్వ‌త్రిక ఎన్నిక‌లు ఇంకా ఏడాది కాల వ్య‌వ‌ధి ఉండ‌గానే ముఖ్య‌మంత్రిని స్వ‌యానా క‌లిసి త‌మ కుటుంబానికి రెండు సీట్లు కేటాయించాల‌ని ఎస్పీవై రెడ్డి కోరార‌ట‌... నంద్యాల ఎమ్మెల్యే అభ్య‌ర్దిగా తెలుగుదేశం త‌ర‌పున సజ్జల శ్రీధర్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తారు అని నంద్యాల అంతా ప్ర‌చారం జ‌రుగుతోంది అంతే కాకుండా ఆయ‌న ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో ఉంటాను అని తెలియ‌చేశారు... నంద్యాల వార్డుల్లో ప‌ట్ట‌ణంలో ఆయ‌న ప‌ర్య‌టించ‌డం ఇప్పుడు ఇక్క‌డ  సంచ‌ల‌నంగా మారింది.. మొత్తానికి భూమా కుటుంబాన్ని, న‌లుదిక్కులా రాజ‌కీయంగా ఇరికిస్తున్నారు అనేది తెలుస్తోంది.. మ‌రి భూమా వార‌సుల రాజ‌కీయం ఎలా ఉంటుందో చూడాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.