బాబుకు విజ‌య‌సాయిరెడ్డి పంచ్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-07 17:40:48

బాబుకు విజ‌య‌సాయిరెడ్డి పంచ్

ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేస్తున్న ప్ర‌జాసంక‌ల్ప‌యాత్రకు సంఘీభావంగా ఎంపీ విజ‌యసాయి రెడ్డి విశాఖ‌ప‌ట్నంలో పాద‌యాత్ర చేస్తున్న సంగ‌తి తెలిసిందే.. ఈ పాయాత్ర నేటితో ఆర‌వ రోజుకు చేరుకుంది...
 
ఇక ఈ యాత్ర‌లో భాగంగా ఎపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు ఆయన‌...ప్ర‌త్యేక‌ హోదా విష‌యంలో చంద్ర‌బాబు రెండునాలుక‌ల ధోర‌ణిలో మాట్లాడుతున్నార‌ని విజ‌య‌సాయి రెడ్డి ఆరోపించారు... వైసీపీ మొద‌టినుంచి ప్ర‌త్యేక హోదా కోసం పోరాడుతోంది కాబ‌ట్టి ఈ అంశం అలాగే ఉంద‌ని లేకుంటే చంద్ర‌బాబు ఎప్పుడో పూర్తిస్థాయిలో అమ్ముడు పోయేవార‌ని మండిప‌డ్డారు.
 
అలాగే టీడీపీ హ‌యాంలో విచ్చ‌ల‌విడిగా అవినీతి జ‌రుగుతోంద‌ని, ఈ అవినీతిని అరిక‌ట్టాలంటే 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రిని చేయాల‌ని విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు... గ‌డిచిన ఎన్నిక‌ల్లో సుమారు ఆరు వంద‌ల‌కు పైగా త‌ప్పుడు హామీల‌ను ప్ర‌క‌టించి అధికారాన్ని ద‌క్కించుకున్న చంద్ర‌బాబు ఇంత‌వ‌ర‌కూ ఒక్క హామీని కూడా ప్ర‌జ‌ల‌కు అమ‌లు చేయ‌లేదని ఆయ‌న విమ‌ర్శించారు.
 
ఇక దీంతోపాటు టీడీపీ పుణ్యమా అంటూ అవినీతిలో ఏపీకి  ప్ర‌థ‌మ స్థానం ద‌క్కింద‌ని ఆరోపించారు... ఇదంతా టీడీపీ ప్ర‌భుత్వ వైఫ‌ల్యం వ‌ల్లే రాష్ట్రం ఇంత ద‌య‌నీయంగా మారుతోంద‌ని విజ‌య‌సాయి రెడ్డి మండిప‌డ్డారు..అయితే తాము అధికారంలోకి వ‌స్తే అవినీతికి చెక్ పెడతామ‌ని, అలాగే అవినీతికి పాల్ప‌డిన వారిపై  క‌చ్చితంగా చ‌ర్య‌లు తీసుకంటామ‌ని విజ‌య‌సాయి రెడ్డి తెలిపారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.