విజ‌య‌సాయిరెడ్డి పాద‌యాత్ర‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-25 17:49:44

విజ‌య‌సాయిరెడ్డి పాద‌యాత్ర‌

ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర‌కు మ‌ద్ద‌తుగా వైసీపీ ఎమ్మెల్యేలు నాయ‌కులు జ‌గ‌న్ తో క‌లిసి కొంద‌రు పాద‌యాత్ర చేస్తున్న విష‌యం తెలిసిందే.. ఇక తాజాగా వైసీపీలో నెంబ‌ర్ 2గా ఉన్న ఎంపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి కూడా మ‌రో కిల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.
 
ప్రజాసంకల్పయాత్రకు సంఘీభావంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ  విజయసాయి రెడ్డి పాదయాత్ర చేయనున్నట్లు వైఎస్సార్‌ సీపీ నేత మళ్లా విజయప్రసాద్‌ తెలిపారు... దీనిపై వైసీపీ నాయ‌కులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.
 
వచ్చే నెల అంటే మే  2వ తేదీ నుంచి గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 72 వార్డుల్లో 10 రోజుల పాటు 180 కిలోమీటర్లు ఎంపీ. విజయసాయి రెడ్డి పాదయాత్ర చేస్తారని చెప్పారు.
 
ఇక ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నయవంచనకు నిరసనగా నగరంలోని ప్రభుత్వ మహిళా కాలేజీ ఎదురుగా ఉన్న దీక్షా ప్రాంగణం వేదికగా ఈ నెల 30వ తేదీన నయవంచన దీక్షలు చేయనున్నట్టు విజయప్రసాద్‌ వెల్లడించారు.ఆరోజున  వైఎస్సార్‌ సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు హాజరవ్వ‌నున్నారు.మొత్తానికి విజ‌య‌సాయిరెడ్డి పాద‌యాత్ర అనేస‌రికి ఇప్పుడు తెలుగుదేశం కూడా ఆలోచిన‌లో ప‌డింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.