విజ‌య‌సాయిరెడ్డి కొత్త ప్లాన్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-02 02:28:25

విజ‌య‌సాయిరెడ్డి కొత్త ప్లాన్

వైయ‌స్సార్ సీపీ అధినేత ఏపీ ప్ర‌తిపక్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర ఓ ప‌క్క కృష్ణా జిల్లాలో జ‌రుగుతుంటే మ‌రో ప‌క్క ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి విశాఖ‌లో పాద‌యాత్రకు నేడు శ్రీకారం చుట్టారు... భారీగా ర్యాలీ, కార్య‌క‌ర్త‌ల న‌డుమ ఆయ‌న పాద‌యాత్ర మొద‌లు అయింది.
 
వైఎస్సార్‌ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయి రెడ్డి సంఘీభావ యాత్ర నగర పరిధిలోని అంగనంపూడి నుంచి ప్రారంభించారు.. వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాదయాత్రకు మద్దుతుగా సంఘీభావ యాత్రతో ప్రజల్లోకి వస్తున్నట్లు ఆయ‌న  వెల్లడించారు
 
విశాఖ‌లోని సంపత్‌ వినాయకుని గుడికి చేరుకుని అక్కడ పూజలు నిర్వహించారు. అనంతరం అగనంపూడి చేరుకుని వైఎస్సార్‌ విగ్రహం నుంచి పాదయాత్రను మొదలుపెట్టారు ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి.ఈ నెల 12వ తేదీ వరకు విజయసాయి విశాఖ నగర పరిధిలోని గాజువాక, పెందుర్తి, విశాఖ పశ్చిమ, తూర్పు, ఉత్తర, దక్షిణ నియోజకవర్గాల్లోని 72 వార్డుల్లో 180 కిలోమీటర్ల మేర పాద‌యాత్ర చేయ‌నున్నారు.. తన సంఘీభావ యాత్రలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైల్వే జోన్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాల్లో జరుగుతున్న అన్యాయాలను ప్రజలకు వివరించనున్నారు.
 
ఇక విశాఖ స‌మ‌స్య‌లు ఉత్త‌రాంధ్రాకు కేంద్రం రాష్ట్ర ప్ర‌భుత్వాలు చేసిన మోసాల పై ఆయ‌న నిల‌దీయ‌నున్నారు... జన్మభూమి కమిటీల అరాచకాలు, టీడీపీ నేతల భూ కబ్జాలు, అనర్హులకు భూ పట్టాలు, రేషన్‌ కార్డులు మంజూరు, మంచి నీరు, పారిశుద్ధ్య సమస్యలను తెలుసుకుంటారు. విజయసాయి రెడ్డి రాజ్యసభలో విశాఖ సహా ఉత్తరాంధ్ర సమస్యలు, అవసరాలపై ప్రస్తావించిన విషయాలను కరపత్రాలుగా రూపొందించారు. వీటిని పార్టీ శ్రేణులు ప్రజలకు పంపిణీ చేస్తారు. సంఘీభావయాత్రలో ప్రతి నియోజకవర్గంలోనూ ఒక బహిరంగ సభను నిర్వహించనున్నారు..
 
ఇక నాలుగేళ్లుగా ఏపీ కోసం తాము ఎంతో కృషిచేశామ‌ని పార్టీ త‌ర‌పున తాము ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉన్నాము అని ఆయ‌న తెలియ‌చేశారు.. ఏపీకి ప్ర‌త్యేక హూదా కోసం వైసీపీ నాలుగు సంవ‌త్స‌రాలుగా అనేక కార్య‌క్ర‌మాలు చేసింది అని ఆయ‌న వెల్ల‌డించారు.. ప్రజాశ్రేయస్సు కోసం వైఎస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాలను కార్యకర్తలందరూ ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అంటూ విజయసాయి రెడ్డి పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.