చంద్ర‌బాబుకు వైవీ కౌంటర్....

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-08 01:34:37

చంద్ర‌బాబుకు వైవీ కౌంటర్....

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అస‌మ‌ర్థ‌త వ‌ల్లే రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా రాలేద‌ని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిప‌డ్డారు...  ఎన్డీఏ ప్ర‌భుత్వం గ‌తంలోనే ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌ద‌ని చెప్పినా చంద్ర‌బాబు వారితో పొత్తు పెట్టుకున్నార‌ని ఆయ‌న అన్నారు... విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న అంశాల‌ను ఒక్క‌టి కూడా కేంద్రం నుంచి సాధించ‌లేక‌పోయార‌ని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వెల్ల‌డించారు... కాగా టీడీపీ నాయ‌కులు రాష్ట్రానికి చేస్తున్న మోసాల‌ను ప్ర‌తీ విష‌యాన్ని ప్ర‌జ‌లు క్షుణ్ణంగా ప‌రిశీలిస్తున్నారు అని అన్నారు.
 
అందులో భాగంగానే ఏపీ ప్ర‌జ‌ల వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కునేందుకే టీడీపీ ప్ర‌భుత్వం రాజీనామా డ్రామాల‌ను తెర‌లేపుతోంద‌ని, నాలుగేళ్లుగా కేంద్రంతో క‌లిసి ప‌నిచేసిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు రాష్ట్రానికి ఒరిగిందేమితో చెప్పాల‌ని వైవీ డిమాండ్ చేశారు...  త‌మ నాయ‌కుడు వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఎన్డీఏ ప్ర‌భుత్వంపై అవిశ్వాస తీర్మాణం క‌చ్చితంగా పెట్టి తీరుతార‌ని అన్నారు... ఆ త‌ర్వాత త‌మ పార్టీ ఎంపీల రాజీనామాల  విష‌యాన్నివెల్ల‌డిస్తామ‌ని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
 
 త‌మ పార్టీ అధినేత జ‌గ‌న్ త్వ‌ర‌లో బీజేపీ తో పోత్తు కు రెడీ అవుతున్నార‌ని సీఎం చంద్ర‌బాబు పార్టీ త‌ర‌పున  రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌చారం చేశార‌ని విమ‌ర్శించారు... తాము ఎట్టి ప‌రిస్థితిల్లోనూ ఎవ‌రితో పొత్తు పెట్టుకోమ‌ని ఏపీ అభివృద్ది కోసం ఎంత వ‌ర‌కూ అయినా  పోరాడుతామ‌ని అన్నారు... వైసీపీకి ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న  మ‌ద్ద‌తును చూసి స‌హించ‌లేక టీడీపీ నాయ‌కులు కుట్ర‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.