చంద్ర‌బాబుకు ఎవ్వ‌రు ఓటు వేయ‌కండి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp mp jc divakar reddy and chandrababu naidu
Updated:  2018-05-29 06:44:22

చంద్ర‌బాబుకు ఎవ్వ‌రు ఓటు వేయ‌కండి

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ఆధ్వ‌ర్యంలో ఈ రోజు మినీ మ‌హానాడు కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి చంద్ర‌బాబు నాయుడుపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఒక వైపు చంద్ర‌బాబును పొగుడుతూ మ‌రో వైపు విమ‌ర్శ‌లు చేస్తూ అక్క‌డున్న‌టువంటి టీడీపీ నాయ‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచారు జేసీ.
 
ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, చంద్ర‌బాబు నాయుడుకి 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎవ్వ‌రూ ఓటు వేయ‌కండి అని ప్ర‌జ‌ల‌కు తెలియ చేశారు జేసీ దివాక‌ర్ రెడ్డి. మ‌న కోసం, మ‌న పిల్ల‌ల‌కోసం, ఈ రాష్ట్ర అభివృద్ది కోసం చంద్ర‌బాబు కు ఓటు వెయ్యాల‌ని చెబుతూనే.. ఏ చంద్ర‌బాబు నాయుడు ఇంకో ఐదు సంవ‌త్స‌రాలు ఉంటే కిరీటం ఏమైనా పెడతారా! అంటూనే చంద్ర‌బాబు ఎప్పుడు కాలువ‌ల‌పైనే ప‌డుకోవ‌డం ఎప్పుడు అది ఇది ఆలోచ‌న అంటూ ఆలోచ‌న‌లు చేస్తుంటార‌ని విమ‌ర్శ‌లు చేశారు.
 
ఇలాగే చంద్ర‌బాబు ప్ర‌తీ సారి టెలీకాన్ఫ్ రెన్స్ పై కుడా తీవ్ర స్థాయిలో జేసీ మండిప‌డ్డారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట‌ట్లోనే ఏ విధంగా చంద్ర‌బాబును విమ‌ర్శించారో చూద్దాం! సార్ టెలీకాన్ఫ్ రెన్స్ మాత్రం మీరు మానుకోక‌పోతే మీరెవ‌రో క‌లేక్ట‌ర్ తో మాట్లాడేది, ప్ర‌తీ ఒక్క‌రితో మాట్లాడుతారు, యా.. నా.. కొడుకు మాకు దొర‌క‌డు ప్ర‌తీ ఒక్క‌రు టెలీ కాన్ఫ్ రెన్స్, టెలీ కాన్ఫ్ రెన్స్ అంటూ తిరుగుతారని జేసీ ఏక వ‌చ‌నంతో మాట్లాడి రాష్ట్ర ప్ర‌జ‌లు షాక్ తినేల మాట్లాడారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.