భార్య చెప్పినా విన‌ని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-09 12:46:13

భార్య చెప్పినా విన‌ని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి?

ఏపీకి ఊపిరిలాంటి ప్ర‌త్యేక హూదా పోరాటంలో వైసీపీ ఎంపీలు ఆమ‌రణ నిరాహార దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది..
 
వైఎస్సార్‌సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, వైఎస్ అవినాశ్ రెడ్డిలు కొనసాగిస్తున్న దీక్షకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది... ఏపీ నుంచి ప‌లు పార్టీల మ‌ద్ద‌తు అలాగే కేంద్రంలో ప‌లు పార్టీల పెద్ద‌లు కూడా వ‌చ్చి క‌లుస్తున్నారు.. ప‌ట్టువ‌ద‌ల‌కుండా ఏపీ బాగుకోసం  వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, వైఎస్ అవినాశ్ రెడ్డిలు దీక్ష కొన‌సాగిస్తున్నారు..
 
వైవీ సుబ్బారెడ్డి ఆరోగ్యం బాగా క్షీణించిందని వైద్యులు చెబుతున్నారు. సోమవారం ఉదయం సుబ్బారెడ్డిని పరీక్షించిన వైద్యులు ఆయన పూర్తిగా డీహైడ్రేషన్‌కు గురయ్యారని తెలిపారు. ఆరోగ్యం క్షీణిస్తోందని, వెంటనే చికిత్స చేయాలని వైద్యులు చెప్పినా ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా వైవీ సుబ్బారెడ్డి మాత్రం దీక్ష విరమించేది లేదని స్పష్టం చేశారు. 
 
ఇక చివ‌ర‌కు దీక్ష విరమించాలని వైవీ సుబ్బారెడ్డిని ఆయన భార్య కన్నీళ్లతో ప్రాధేయపడ్డారు. వైద్యులు, కుటుంబసభ్యులు చెప్పినా తన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా దీక్ష కొనసాగిస్తున్న సుబ్బారెడ్డిని వైద్యుల సూచన మేరకు సిబ్బంది సాయంతో పోలీసులు బలవంతంగా రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. ఆయనను ఆస్పత్రికి తరలించే సమయంలో దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
 
కాగా, తీవ్ర అస్వస్థతకు లోను కావడంతో ఇద్దరు ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వరప్రసాదరావులను ఇప్పటికే బలవంతంగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఏపీకి సంజీవని లాంటి హోదా సాధన కోసం 73 ఏళ్ల వయసులో మేకపాటి, 64ఏళ్ల వయసులో వరప్రసాద్‌లు ఆమరణ నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఇక వ‌య‌సు రిత్యా ఇంత ఇబ్బంది ప‌డినా ఎంపీలు ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేయ‌డాన్ని ఏపీలో ప్ర‌జ‌లు హ‌ర్షిస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.