బాబుని న‌మ్ముకుని ఆ ముగ్గురు మునిగిపోయారు?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

mps situation are very bad
Updated:  2018-03-18 12:16:45

బాబుని న‌మ్ముకుని ఆ ముగ్గురు మునిగిపోయారు?

తెలుగుదేశం ఏపీలో 2500 వ‌ర‌కూ అధికారంలో ఉండాలని,  2050 వ‌ర‌కూ చంద్ర‌బాబే ఏపీ ముఖ్య‌మంత్రి అని, త‌ర్వాత లోకేష్ సీఎం అని టీడీపీ నాయ‌కుల ఆలోచ‌న‌.. జ‌గ‌న్  జైలుకే అని కామెంట్లు చేసేవారు.. ఇక బీజేపీ అంటే మేము, మేము అంటే క‌మ‌లం పార్టీ మిత్ర‌ప‌క్షం ...మేము మోడీకి ఎంత చెబితే అంత, నలుగురు ప్ర‌ధానుల‌ను చూశాను, ఆరుగురు రాష్ట్ర‌ప‌తుల‌ను చూశారు, 60 మంది సీఎంల‌ను చూశాను,  హైద‌రాబాద్ నేనే నిర్మించాను అని చెప్పేబాబు గారి మాటలు విని పార్టీ ఫిరాయించారు వైసీపీ నాయ‌కులు.. ముగ్గురు ఎంపీలు పార్టీ మారి తెలుగుదేశంలో ఎటువంటి పొలిటిక‌ల్ స్టెప్ వెయ్యాలా అని ఆలోచ‌న‌లో ప‌డ్డారు.
 
అస‌లే ఫిరాయింపుల పై కేంద్రం ఎటువంటి డెసిష‌న్ తీసుకోవ‌డం లేదు... ఇప్పుడు ఫిరాయింపుల‌పై కేంద్ర డెసిష‌న్ తీసుకుంటే న్యాయ‌ప‌రంగా కేసులు గెలిస్తే త‌మ ప‌రిస్ధితి ఏమిటి అని తెలుగుదేశంలోకి పార్టీ ఫిరాయించిన ఎంపీలు మ‌ద‌న‌ప‌డుతున్నారు.. అయితే ప్ర‌మాణ స్వీకారానికి ముందే పార్టీ మారారు నంద్యాల వైసీపీ ఎంపీ ఎస్పీవై రెడ్డి. త‌ర్వాత ఎంపీ కొత్త‌ప‌ల్లి గీత‌, ఇటీవ‌ల క‌ర్నూలు ఎంపీ బుట్టారేణుక పార్టీ మారారు.
 
ఇప్పుడు సొంత పార్టీ వైసీపీ అవిశ్వాసం పెట్ట‌డానికి రెడీ అయింది.. ఇటు అద్దె పార్టీ తెలుగుదేశం కూడా అవిశ్వాసానికి రెడీ అయింది.చివ‌ర‌కు ఓటింగ్ వ‌ర‌కూ ఈ అవిశ్వాసం రాలేదు అయితే వైసీపీ విప్ జారీ చేసింది ఈ విప్ నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి ఎటువంటి దారి లేదు ఈ ఫిరాయింపు ఎంపీల‌కు దారిక‌నిపించ‌లేదు 
 
ఒక‌వేళ విప్ ను ఉల్లంఘిస్తే సభ్వత్వం పోవటం ఖాయం. అలాగని ఓటింగ్ కు గైర్హాజరయ్యేందుకూ లేదు. ఎటు ఓటు వేసినా, ఓటింగ్ నుండి గైర్హాజరైనా చివరకు పోయేది వారి సభ్యత్వమే. ఇలాంటి స‌మ‌యంలో పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానం పై ఓటింగ్ జ‌రుగ‌లేదు, కాస్త‌రిలీఫ్ దొరికినా జ‌రుగ‌బోయే రాజ‌కీయం ఏమిటో తెలియడం లేదు.
 
ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా సీట్లు ఇచ్చే ప‌రిస్దితి టీడీపీలో లేదు, అయితే ఇటు ఎమ్మెల్యేగా బుట్టారేణుక వెళ్లాలి అనే ఆలోచ‌న‌లో ఉంటే, అటు ఎస్పీవై రెడ్డి పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పనున్నారు....ఇటు కొత్త‌ప‌ల్లి గీత కూడా కొత్త దారి చూసుకోనున్నారు అనేది ఇప్పుడు తెలుగుదేశం నాయ‌కులే చ‌ర్చించుకుంటున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.