ముద్దుకృష్ణ‌మ నాయుడు వార‌సుల‌కు హ్యాండే?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-26 16:32:57

ముద్దుకృష్ణ‌మ నాయుడు వార‌సుల‌కు హ్యాండే?

టీడీపీలో మ‌రో ఎన్నిక పోరు క‌నిపించ‌నుంది.. తెలుగుదేశంలో సీనియ‌ర్ నాయకుడు ఎమ్మెల్సీగా ఉండి గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడు అనారోగ్యంతో  ఇటీవ‌ల మృతి చెందారు..ఆయనకు భార్య, కుమార్తె, ఇద్దరు కుమారులున్నారు. ముద్దుకృష్ణమ రాజకీయ వారసత్వం కోసం కుమారులు భానుప్రకాష్‌, జగదీష్‌ పోటీ పడుతుండడం అధిష్ఠానానికి సమస్యగా మారింది...
 
ఇరువురు రాజకీయ వార‌సత్వం కోసం పోటీ ప‌డుతున్నారు. నగరి నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఎవరిని నియమించాలో తేల్చుకోలేక అధిష్ఠానం సతమతమవుతోంది. అలాగే ఈ లోపే ముద్దుకృష్ణమ మృతితో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక ముంచుకొచ్చింది.
 
తాజాగా ముద్దుకృష్ణమ కుటుంబంలో ఆయన సతీమణి, కుమార్తె, అల్లుడు, చిన్న కుమారుడు ఎమ్మెల్సీ పదవిని తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు అని అంటున్నారు నాయ‌కులు.. అయితే ఆ ప‌దవికి బ‌దులు న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ ప‌ద‌విని ఆశిస్తున్నారు ఆ కుటుంబం. ఇక ఆ ప‌ద‌వితో పాటు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి ఎమ్మెల్యే టికెట్ కావాలి అని గాలి కుటుంబం కోరుకుంటోంది.
 
కుటుంబంలో ఇంచార్జ్ ప‌ద‌వికి  అత్యధికులు జగదీష్‌ వైపు మొగ్గు చూపుతున్నారు అని తెలుస్తోంది..ఇటీవలే ముద్దుకృష్ణమ సతీమణి, కుమార్తె, అల్లుడు, వియ్యంకుడైన కర్ణాటక మాజీ మంత్రి కట్టా సుబ్రమణ్యం నాయుడులతో కూడిన బృందం చంద్రబాబును కలసి జగదీష్‌ను ఇన్‌ఛార్జిగా ప్రకటించాలని కోరారు. 
 
ఇక ఆ స‌మ‌యంలో త‌మ‌కు ఎమ్మెల్సీ అక్క‌ర్లేద‌ని ఎమ్మెల్యే టికెట్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గదీష్ కు ఇవ్వాల‌ని నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ గా బాధ్య‌త‌లు ఇవ్వాలి అని కోరారు.ముద్దుకృష్ణమ పెద్ద కుమారుడు భానుప్రకాష్ పొలిటిక‌ల్ లైఫ్ ఎట్లా ఉండ‌బోతోంది అని చ‌ర్చించుకుంటున్నారు ఆయ‌న అనుచ‌రులు.. ఇప్పటి వ‌ర‌కూ భానుకు బాధ్య‌త‌లు అని అంద‌రూ అనుకున్నారు,
 
ఇక భాను ప్ర‌కాష్ మంత్రి నారాలోకేష్ తో స‌న్నిహితంగా ఉంటారు... ఆయ‌న ఈ వ్యవ‌హారంలో వ‌స్తే మాత్రం భానుకి ఛాన్స్ ఇస్తారు అని అంటున్నారు... మ‌రి దీనిపై సీఎం  చంద్ర‌బాబు నిర్ణ‌యం ఏవిధంగా ఉంటుందో చూడాలి అని అనుకుంటున్నారు.. అయితే ఇరువురిలో ఎవ‌రికి సీటు అనేది స‌ర్వే చేస్తే బెట‌ర్ అని జిల్లా సీనియ‌ర్లు బాబుకు తెలియ‌చేశార‌ట‌.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.