బ్రేకింగ్ ఒక్క‌టికాబోతున్న బ‌ద్ద శుత్రువులు ఎంపీ టికెట్ ఆఫ‌ర్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-01 15:15:00

బ్రేకింగ్ ఒక్క‌టికాబోతున్న బ‌ద్ద శుత్రువులు ఎంపీ టికెట్ ఆఫ‌ర్

2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అధికార‌మే ల‌క్ష్యంగా చేసుకుని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు తాను అధికారంలోకి వ‌చ్చిన ఆరునెల‌ల్లో కాపుల‌ను బీసీల్లో అలాగే బీసీల‌ను ఎస్టీల్లో చేర్చుతాన‌ని హామీ ఇచ్చారు. అయితే ఆయ‌న అధికారంలోకి వ‌చ్చిన నాలుగు సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకున్నా కూడా వాటి ప్ర‌స్తావ‌న గురించి మాట్లాడ‌లేదు. ఇక చంద్ర‌బాబు ఇచ్చిన హామీ నీళ్లు కారుస్తార‌నే ఉద్దేశంలో మాజీ ఎంపీ ముద్ర‌గ‌డ ప‌ధ్మ‌నాభం ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ధ‌ర్నాలు, దీక్ష‌లు చేయ‌బోతే అధికార బ‌లంతో స‌ర్కార్ ఆయ‌న‌ను హౌస్ అరెస్ట్ చేసింది. 
 
కాపు నేత‌ను అయిన త‌న‌ను ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కుమారుడు మంత్రి నారా లోకేశ్ పోలీస్ అధికారుల‌తో దాడి చేయించి త‌న‌ను త‌న కుమారుడిని కోడ‌లిని అన‌రాని మాట‌లు అన్నార‌ని గతంలో ముద్ర‌గ‌డ తెలిపారు. అయితే టీడీపీ స‌ర్కార్ ఎన్ని విధాలు బెదిరింపుల‌కు దిగినా కూడా త‌న ఉద్య‌మం ఆగ‌ద‌ని  అధిష్టానాన్ని విమ‌ర్శిస్తూ ముఖ్య‌మంత్రి కార్యాలయానికి లేఖలు రాస్తూనే ఉన్నారు.
 
గ‌త నాలుగు సంవ‌త్సరాలుగా కాపుల‌కు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకి ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌న్నంత వైర్యం ఉన్న క్ర‌మంలో ఉన్న‌ట్టుండి ముద్ర‌గ‌డ టీడీపీ తీర్ధం తీసుకోనున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అంతేకాదు ఆయ‌న 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎంపీగా ఎక్క‌డి నుంచి పోటీ చేస్తాన‌ని చెబితే అక్క‌డ అధిష్టానం పోటీ చేయించేందుకు సిద్దంగా ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. జ‌గ్గంపేట లో కాపు రిజ‌ర్వేష‌న్ల‌పై ప్ర‌తిపక్ష‌నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌ట‌నపై ముద్ర‌గ‌డ తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేసిన నేప‌థ్యంలో టీడీపీ అధిష్టానం ఆయ‌న‌ను మంచిక చేసుకుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. 
 
అంతేకాదు ఆయ‌న‌తోపాటు ఆయ‌న కూమారుడుకి కూడా టీడీపీ త‌ర‌పున ఎమ్మెల్యే టికెట్ ఆఫ‌ర్ చేసినట్లు తెలుస్తోంది. కాపు రిజ‌ర్వేష‌న్ల‌ను ప్ర‌క‌టించ‌నందుకు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై దుమ్మెత్తి పోసిని ముద్ర‌గ‌డ ఇప్పుడు టీడీపీలో చేర‌డాన్ని కాపు కుల‌స్తులు ఆహ్వానిస్తారా లేక వ్య‌తిరేకిస్తారా అనేది తేలాల్సి ఉంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.