ప‌వ‌న్‌పై ముద్ర‌గ‌డ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు...

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-10 02:18:26

ప‌వ‌న్‌పై ముద్ర‌గ‌డ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు...

2018-  2019 కేంద్ర‌బ‌డ్జెట్ లో  దేశంలో ఏ రాష్ట్రానికి జ‌ర‌గ‌ని అన్యాయం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి జ‌రిగింద‌ని, ఇదంతా ముఖ్యమంత్రి చంద్ర‌బాబు అస‌మ‌ర్థ‌త  వ‌ల్లే ఏపీ కి అన్యాయం జ‌రుగుతోంద‌ని ప్ర‌తి ప‌క్షాలు మిత్ర‌ప‌క్షాలు బాబుపై మండి ప‌డుతున్నాయి... రాష్ట్ర‌ విభ‌జ‌న త‌ర్వాత  విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న విశాఖ రైల్వే జోన్ కానీ, ప్ర‌త్యేక హోదా కానీ ఏ ఒక్క అంశంపై నా కేంద్ర స‌ర్కార్ బ‌డ్జెట్ లో ప్ర‌క‌టించ‌క‌పోవ‌డంతో !! సేవ్ ఏపీ !! అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ధ‌ర్నాలు చేప‌డుతున్నారు ఏపీ ప్ర‌జ‌లు నాయ‌కులు.
 
అయితే ఈ అంశంపై మాజీ మంత్రి , కాపు ఉద్య‌మ‌నేత ముద్ర‌గ‌డ స్పందించారు... ఎప్పుడైతే చంద్ర‌బాబు నాయుడు, ఎంపీలు అంద‌రూ క‌లిసి వారి ప‌ద‌వుల‌కు రాజీనామా చేస్తారో... అప్పుడే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా,విభ‌జ‌న చ‌ట్టంలో పెర్కొన్న రైల్యే జోన్ వ‌స్తాయ‌ని ముద్ర‌గ‌డ అన్నారు...వీరు రాజీనామా చేయ‌క‌పోతే   హోదా సాధనకు పవన్‌ కల్యాణ్‌ నాయకత్వం సరిపోదని కాపు నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. 
 
ఈ సంద‌ర్భంగా  తిరుప‌తిలో విలేక‌ర్ల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ... కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించామ‌ని అబ‌ద్దాలు  ప్ర‌చారం చేస్తున్నార‌ని ముద్ర‌గ‌డ చంద్ర‌బాబుపై నిప్పులు చెరిగారు... ఎప్పుడైతే తహశీల్దార్ కార్యాలయం నుంచి  కాపు కుల‌స్తులు బీసీ సర్టిఫికేట్ పొందుతారో అప్పుడే  త‌మ‌కు పండుగ అని అన్నారు. చంద్రబాబు జాప్యం  వల్లే కాపులంతా రోడ్లపైకి వచ్చారని విమర్శించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.