ముద్ర‌గ‌డ ఆ పిలుపిస్తే జ‌గ‌న్ సై అంటే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-25 14:17:22

ముద్ర‌గ‌డ ఆ పిలుపిస్తే జ‌గ‌న్ సై అంటే

ఎవ‌రు ఏమ‌నుకున్నా, కాపులు కాదు అన్నా ఔను అన్నా, 2014 ఎన్నిక‌ల్లో 69 శాతం కాపు ఓటు మొత్తం తెలుగుదేశానిక ప‌డిండి.. మెజార్టీ గోదావ‌రి జిల్లాలు అయితే ఇటు తిరుప‌తి క‌డ‌ప విజ‌య‌న‌గ‌రం విశాఖ ఇలా వ‌రుస‌గా ఉన్నాయి. ఇవ‌న్నీ స‌ర్వేలు త‌ర్వాత వెల్ల‌డించిన నిగూడ స‌త్యాలు... చంద్ర‌బాబు వాక్కు బ్ర‌హ్మ‌వాక్కు అని, ఆయ‌న అన్నారు అంటే క‌చ్చితంగా మ‌న‌కి రిజ‌ర్వేష‌న్లు ఇస్తారు అని భావించారు కాపులు. వెంట‌నే వారికి ఓటు వేశారు..అస‌లు కాపుల‌కు జ‌గ‌న్ సీట్లు ఎక్కువ ఇచ్చినా, అవ‌న్నీ2014 ఎన్నిక‌ల్లో ఫ‌లించ‌లేదు.. ఇక్క‌డ టీడీపీ నాల్గ‌వ హామీగా ప్ర‌క‌టించిన కాపుల‌కు బీసీ రిజ‌ర్వేష్ అనేది కాపులకు మైండ్ లో ఫిక్స్ అయిపోయింది.
 
ఇక 10 నెల‌ల స‌మ‌యం మాత్ర‌మే ఎన్నిక‌లకు ఉంది... ఈ స‌మ‌యంలో కాపుల‌కు చంద్ర‌బాబు వ‌చ్చే ఎన్నిక‌ల‌లోపు రిజర్వేష‌న్లు ఇస్తాం, కేంద్రం ద‌గ్గ‌ర పెండింగ్ లో ఉన్న ఈ ఫైల్ ని ముందు కు క‌దుపుతాం అని చెబుతారా అంటే, అస‌లు ఆ అంశం ప‌క్క‌న పెట్టేశారు.. అయితే కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం పిలుపు ఏమి ఇచ్చినా చెయ్య‌డానికి కాపులు అంద‌రూ సిద్దంగా ఉన్నారు.. అందులో భాగంగానే కాపులు అంద‌రూ ఆయ‌న  ఎటువంటి నిర్ణ‌యం ప్ర‌క‌టిస్తారా అని చూస్తున్నారు.
 
ఇక టీడీపీని న‌మ్మ‌లేము అంటున్న ముద్ర‌గ‌డ వైసీపీ అధినేత జ‌గ‌న్ తో త‌మ రిజ‌ర్వేష‌న్ల పై ప్ర‌క‌ట‌న చేయిస్తే, ఇటు వ‌న్సైడ్ గా జ‌గ‌న్ కు ఓట్ల‌ని మల్లుతాయి..కాదు అని తెలుగుదేశం ఎన్నిక‌ల స్ట్రాట‌జీని ఉప‌యోగించి బీజేపీతో చ‌ర్చించి, కాపుల రిజ‌ర్వేష‌న్ బిల్లును ముందుకు తీసుకువెళితే కాస్త టీడీపీకి కాపు ఓటు మ‌ల్లుతుంది. అందుకే ముద్ర‌గ‌డ ఈ లైన్ లో ఆలోచిస్తున్నారు. ఇద్ద‌రు నాయ‌కుల‌లో మ‌న‌కు ఎవ‌రు ముందు ఈ ప‌నిచేస్తే వారికే మ‌న ఓటు అనేలా ముద్ర‌గ‌డ ఆయ‌న నాయ‌ల‌కు ఆలోచ‌న‌.
 
అయితే ఈ విష‌యంలో జ‌గ‌న్ సై అంటే, ముద్ర‌గ‌డ చెప్పిన విధంగా కాపులు ఆకాంక్ష పై ముందుకు వ‌స్తే, సీఎం కూడా దీనికి అడ్డుక‌ట్ట వేయ‌వ‌చ్చు. ఈ ప‌నిని ఆయ‌నే ముందుకు న‌డిపించ‌వచ్చు.. ఒక‌వేళ అలా చేసినా జ‌గ‌న్ కు భ‌య‌ప‌డి ముందుకు పెట్టారా అని టీడీపీకి రివ‌ర్స్ కౌంట‌ర్ రావ‌చ్చు. కాని అమ‌లాపురం తుని వేదిక‌గా కాపులు మాత్రం జ‌గ‌న్ ఎటువంటి ప్ర‌క‌ట‌న చేస్తారా అని వెయిట్ చేస్తున్నారు. చూడాలి జ‌గ‌న్ దీనిపై ఎటువంటి ప్ర‌క‌ట‌న చేస్తారో.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.