ముద్ర‌గ‌డ లేఖ‌తో చంద్ర‌బాబుకు త‌ల‌నొప్పి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

mudragada and chandrababu
Updated:  2018-09-11 03:43:35

ముద్ర‌గ‌డ లేఖ‌తో చంద్ర‌బాబుకు త‌ల‌నొప్పి

మాజీ ఎంపీ ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం మ‌రోసారి ఎపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయ‌కుడుకు బ‌హిరంగ లేఖ రాశారు. ఈ లేఖ‌లో టీడీపీ అధిష్టానాన్ని సుమారు ఏడు ప్ర‌శ్న‌లతో సందించారు.. దీంతో చంద్ర‌బాబుకు పెద్ద‌త‌ల‌నొప్పిగా మారుతుంది.
 
ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం స‌మ‌స్కార‌ములు....
 
1. కేంద్ర ప్ర‌భుత్వ‌మున‌కు రాష్ట్రం ప్ర‌భుత్వం అసెంబ్లీలో ఆమోదించి పంపిన బ‌లిజ‌, తెగ‌, కాపు బీసీ రిజ‌ర్వేష‌న్ల బిల్లు నెంబ‌ర్ 33-2017 వాప‌సు తీసుకోవాల‌ని అన్నారు ప‌ద్మ‌నాభం.
 
2. తిరిగి ప్ర‌స్తుతం జ‌రుగుతున్న‌ అసెంబ్లీలో స‌వ‌ర‌ణ‌తో కొత్త‌బిల్లును ప్ర‌వేశ‌పెట్టి గౌర‌వ గౌవ‌ర్న‌ర్ గారితో చ‌ట్టం చేయించార‌లి.
 
3 బిల్లు చ‌ట్టం అయిన త‌ర్వాత జీ.ఓ ఇచ్చి త‌హశిల్దార్ కార్యాల‌యంలో మా జాతికి బీసీ-ఎఫ్ స‌ర్టిఫికెట్ ఇప్పించాలి.
 
4 బిల్లు 33-2017లో కొన్ని స‌వ‌ర‌ణ‌లు చేయ‌వ‌ల‌సి ఉన్న‌ట్లు న్యాయ‌వాదులు చెబుతున్నారు.
 
5 అందుచేత ముఖ్య‌మంత్రి గారికి అభ్యంత‌రం లేక‌పోతే నాకు స‌ల‌హాలు ఇచ్చినా న్యాయ‌వాదుల‌చేత బిల్లును త‌యారు చేయిస్తాను...ఆ త‌ర్వాత ప్ర‌భుత్వం వారికి అనుకూల‌మైన ప‌ద్ద‌తుల‌లో మార్పులు చేర్పులు చేయించుకోవ‌చ్చు.
 
6 ద‌య‌చేసి మా జాతికి ఇచ్చిన బీసీ రిజ‌ర్వేష‌న్ రాష్ట్రంలో త‌క్ష‌ణం అమ‌లు చేయించి శుభం చూపించ‌మ‌ని కోరుచున్నాను. 
 
7 రాష్ట్రంలో అముల చేసి, త‌ర్వాత కేంద్రం స‌ర్వీసులు గురించి అలోచించండి. పెడార్ధాలు తీయ‌కండి, వంకులు చూప‌కండి, త‌క్ష‌న‌మే హామీల‌ను అమ‌లు చేసి చ‌రిత్ర పురుషుడు అవ్వండి అంటూ ముద్ర‌గ‌ఢ భ‌హిరంగ లేఖ రాశారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.