చంద్రబాబు పదవి ముగిసిన అధ్యాయం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-29 02:56:30

చంద్రబాబు పదవి ముగిసిన అధ్యాయం

2014 ఎన్నికలలో చంద్రబాబు అధికారం కోసం ఒక్కో వర్గానికి ఒక్కొక హామీని ఇచ్చి అధికారాన్ని దక్కించుకున్నారు...ఎన్నికల కోసం టీడీపీ ఇచ్చిన 600 హామీలలో కాపులను బీసీలలో చేరుస్తా అని చెప్పి కాపు ఓటర్లను తన వైపుకు తిప్పుకున్నారు చంద్రబాబు..ఆ తర్వాత అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడిచిన ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా కాపులకు మోసం చేసారు బాబు...కాపులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మ నాభం  ఎప్పటి నుంచో పోరాడుతున్నారు...
 
కాపు రిజర్వేషన్ కోసం పాదయాత్ర చేస్తా అని ముద్రగడ ప్రకటించగానే చంద్రబాబు భయపడ్డారు... అందుకే ముద్రగడని పాదయాత్ర చేయకుండా హౌస్ అరెస్ట్ చేశారు..కాపులకు న్యాయం చేయాలనీ పోరాడుతున్న ముద్రగడ పద్మనాభంని, అయన కుటుంబ సభ్యులని అవమానించింది చంద్రబాబు ప్రభుత్వం...అయినా కూడా  కాపుల కోసం ముద్రగడ పోరాటం చేస్తూనే ఉన్నారు...ముద్రగడ మీడియా ముఖంగా, లేఖల  ద్వారా చంద్రబాబు పైన, టీడీపీపైన వ్యాఖ్యలు చేసేవారు..ఇప్పుడు మరో సారి చంద్రబాబుకు ఘాటైన లేఖ రాసారు ముద్రగడ... 
 
మీ పదవి ముగిసిన అధ్యాయం లాంటిది...మరో ఒక సంవత్సరంలో మీ పార్టీ ఆయుష్షు పూర్తవుతుంది...ఇలాంటి సమయంలో రెండేళ్ల కాలపరిమితి కలిగిన పదవులు ఇవ్వడం ఎంతవరకు న్యాయం? అని ప్రశ్నించారు ముద్రగడ...మీ కార్తకర్తలకు పదవుల తేనెను అరచేతికి రాసి, మోచేతి వరకు నాకిస్తున్నారు...లిక్కర్ షాప్ లైసెన్స్ కూడా మరో ఐదేళ్లు పొడిగిస్తున్నావ్ అని ప్రచారం జరుగుతుంది...అందులో వచ్చే లాభంలో టీడీపీ వాటా ఎంత? నీ కుటుంబం వాటా ఎంత అని లేఖలో ప్రశ్నించారు ముద్రగడ...వచ్చే ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి మద్యపాన నిషేధం చేస్తే వ్యాపారుల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు...మీరు స్థిరత్వం కోల్పోయి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏదైనా పెద్ద హాస్పిట్‌లో చూపించుకోవాలంటూ' సీఎం చంద్రబాబుకు రాసిన లేఖలో ముద్రగడ సూచించారు.
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.