ముద్ర‌గ‌డ హెచ్చ‌రిక‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-25 15:17:31

ముద్ర‌గ‌డ హెచ్చ‌రిక‌

మాజీ మంత్రి కాపు ఉద్య‌మ‌నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం మ‌రోసారి లేఖ రూపంలో ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడుపై అలాగే ఆ పార్టీ ఎమ్మెల్యేల‌పై మండిపడ్డారు... రాష్ట్ర ప్ర‌జ‌లు ప్ర‌యాణించే ఆర్టీసీ బ‌స్సులో తెలుగుదేశం పార్టీ నాయ‌కుల పోస్ట‌ర్లు ఎందుకు అతికించాల‌ని ముద్ర‌గ‌డ లేఖ ద్వారా ప్ర‌శ్నించారు...మీ ఫోటోల‌తో కూడిన పోస్ట‌ర్ల‌ను సొంత వాహ‌నాల‌పై అంటించుకోవాల‌ని సూచించారు... టీడీపీ నాయ‌కులు ఆర్టీసీ బ‌స్సుల‌ను సొంత వాహ‌నాల్లా వ్య‌వ‌హ‌రించి సిబ్బందిపై దౌర్జన్యం చేయ‌డం స‌రికాద‌ని ముద్ర‌గ‌డ అన్నారు.
 
అధికార బ‌లం, డబ్బు బలం చూసుకుని అమాయ‌క‌ ప్ర‌జ‌ల‌పై దాడి చేస్తున్నార‌ని, ఈ దాడి ఎన్ని రోజులు చేస్తార‌ని, మ‌హా అయితే ఒక సంవ‌త్స‌రం పాటు చేస్తార‌ని, ఆ త‌ర్వాత ప్రజ‌లు త‌మ ఓటు ద్వారా టీడీపీ నాయ‌కులకు త‌గిన బుద్ది చేబుతార‌ని ముద్ర‌గ‌డ అన్నారు... అలాగే కులాల మధ్య గొడవల అలజడులను రేపుతూ  టీడీపీ ఎన్నో తమషాలు చేస్తోందని ఆరోపించారు. పోలీసు వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి ప్రజలకు న్యాయం జరగకుండా అన్యాయం చేస్తున్నార‌ని అన్నారు.
 
దీంతో  పాటు 2014 ఎన్నిక‌ల ప్ర‌చారంలో  చంద్ర‌బాబు కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు కల్పిస్తామ‌ని చెప్ప‌డంతో ఆయ‌న‌కు త‌మ కాపులంద‌రూ క‌లిసి ఓటు వేశార‌ని అన్నారు.. కానీ ఇప్పుడు అధికారంలోకి వ‌చ్చాక కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ల మాట ఎత్తితే అక్ర‌మంగా అరెస్ట్ చేయిస్తున్నార‌ని ముద్ర‌గ‌డ మండిప‌డ్డారు...అయితే మ‌ళ్లీ ఇప్పుడు సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న త‌రుణంలో చంద్ర‌బాబు మ‌రో కొత్త డ్రామాకు తెర లేపుతున్నార‌ని అన్నారు.
 
ప్రత్యేక హోదా వంకతో చంద్ర‌బాబు త‌న జన్మదినాన ప్రభుత్వ ఖజానా నుండి ఖర్చు చేసిన కోట్లాది రూపాయల వల్ల ఏం సాధించారో ప్రజలకు చెప్పాలని అన్నారు. ఎదుట వ్యక్తికి వేలు చూపి విమర్శించేట‌ప్పుడు మూడు వేళ్ళు ఎవరిని చూపిస్తాయో తెలుసుకుని నడవాల‌ని ముద్ర‌గ‌డ లేఖ‌లో పేర్కొన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.