స్టే వ‌ద్దు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-04 17:18:42

స్టే వ‌ద్దు

కాపు ఉద్య‌మ నేత మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం సీఎం చంద్ర‌బాబు పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.. చంద్ర‌బాబుకు మ‌రో సారి ఘాటుగా లేఖ రాశారు ఆయ‌న‌.. గుమ్మడికాయల దొంగ ఎవరంటే ఈ మధ్య మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారని సీఎం చంద్ర బాబునుద్దేశించి విమర్శించారు. మీరు నిప్పు కదా.. నిప్పుకు భయం ఉంటుందా అని ఎద్దేవా చేశారు.
 
ఇక ఎక్క‌డ స‌భ‌లు జ‌రిగినా నా వెంట ప్ర‌జ‌లు ఉండాలి కేంద్రం త‌న‌పై కుట్ర‌ప‌న్నుతోంది అని ప్ర‌జ‌ల‌ను వేడుకుంటున్నారు.. అస‌లు మీరు ప్ర‌జ‌ల‌కు ఏమి చేశారు అని?  వారు అంద‌రూ మీ వెన‌కాల ఉండాలి కాస్త చెప్పండ‌ని ఆయ‌న అన్నారు..
 
అస‌లు మీరు ప్ర‌జ‌ల‌కు ఈ నాలుగు సంవ‌త్స‌రాలుగా చేసింది ఏమిటి..? ఏ ఘనకార్యం చేశారని ప్రజలు మీ వెనుక ఉండాలని కోరుకుంటున్నారు అంద‌రూ తెలుసుకోవాలి అని అనుకుంటున్నారని ఆయన అన్నారు.మీ వెనకాలే ఉంటే మీ మాదిరిగానే అక్రమ కేసులు, ఉక్కుపాదాలతో అణచిచేస్తే అమాయక ప్రజలకు దిక్కెవరు. మీ కుమారునిపై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్రాన్ని ఎందుకు సవాల్ చేయలేకపోతున్నారు. 
 
సీబీఐ విచారణ కోసం కేంద్రానికి సవాలు విసరకపోతే చరిత్రహీనులు కావడం తధ్యం . ఒకవేళ మిమ్మల్ని, మీ కుమారుడు నారా లోకేష్‌ని అరెస్టు చేస్తే..కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవద్దని నా సలహా   అని లేఖలో పేర్కొన్నారు. మొత్తానికి ఇప్పుడు మంత్రి నారా లోకేష్ పై సీఎం చంద్ర‌బాబు పై కేంద్రం గురి పెట్టింది అనేది నాయ‌కుల మాట‌ల బ‌ట్టీ తెలుస్తోంది. 
 
జైలు అనే మాట‌ ప‌దే ప‌దే వినిపించ‌డం పై అంద‌రూ ఆలోచ‌న‌లో ప‌డ్డారు... నిజంగా వాస్త‌వంగా జ‌రిగిన అక్ర‌మాలు బ‌య‌ట‌ప‌డ‌తాయి అని అనుకుంటున్నారు... మ‌రో ప‌క్క బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు కూడా ఇప్ప‌టికే ప‌ట్ట‌సీమ‌లో జ‌రిగిన అవినీతి పై 15 రోజుల్లో కోర్టుకు వెళ‌తామ‌ని సాక్ష్యాదారాలు స‌మ‌ర్పిస్తాము అని తెలియ‌చేశారు...
 
మ‌రో ప‌క్క వైసీపీ ఎంపీ విజయ‌సాయిరెడ్డి కూడా ఇక్క‌డ జ‌రిగిన అక్ర‌మాలు  అన్ని ప్ర‌ధానికి స‌మ‌ర్పిస్తాను, సీఎం చంద్ర‌బాబును మంత్రుల‌ను వ‌దిలే ప్ర‌స‌క్తేలేదు అంటున్నారు... సో మ‌రో నెల‌లో ఏపీ రాజ‌కీయాలు కీల‌క మ‌లుపులు తిరుగుతాయి అని అంటున్నారు విశ్లేష‌కులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.