చంద్ర‌బాబు ఓ బ‌చ్చా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-12 16:39:19

చంద్ర‌బాబు ఓ బ‌చ్చా

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబుకు ఎటుచూసినా వ్య‌తిరేక‌త ప్ర‌భావం పెరిగిపోతోంది... బాబు అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి తెలుగు తమ్ముళ్లు బాగుప‌డుతున్నారు త‌ప్ప, ప్ర‌జ‌లు బాగుప‌డిన‌ట్లు క‌నుచూపుమేర చూసినా క‌నిపించ‌ర‌ని అంటున్నారు కొంద‌రు... పేరుకు మాత్రం త‌మ‌పార్టీ వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌ పార్టీ అని, భ‌జ‌న చేసుకునే చంద్ర‌బాబు... నిన్న కూడా సేమ్ సీన్ ను రిపీట్ చేశారు...
 
మాహాత్మ జ్యోతిరావు పూలే జ‌యంతి సంద‌ర్భంగా పూలేకు నివాళ‌లు అర్పించిన చంద్రబాబు... ఆ త‌ర్వాత ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడుతూ తాము అధికారంలోకి వ‌చ్చాక వెనుకబ‌డిన వ‌ర్గాల‌వారికి అధిక ప్రాధాన్య‌త‌ ఇస్తున్నామ‌ని చెప్పుకొచ్చారు... దీంతో చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల‌కు ప్ర‌జ‌లు ఆగ్రహం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే.
 
ఇక తాజాగా కాపు ఉద్య‌మ నేత మాజీమంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం చంద్ర‌బాబుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు... దేశంలో త‌న‌కంటే సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు ఎవ‌రూ లేర‌ని ఆయ‌న చెబుతుంటే చాలా హాస్యాస్ప‌దంగా ఉంద‌ని అన్నారాయ‌న‌.. రాజ‌కీయంగా చూసుకుంటే నా ముందు నువ్వో బ‌చ్చా అన్ని ముద్ర‌గ‌డ చంద్ర‌బాబు పై ఫైర్ అయ్యారు... 40 ఏళ్ల రాజకీయ అనుభం ఉందని, మీరే దేశంలోనే సీనియర్ నేతను అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు తప్ప.. రాష్ట్రానికి మీరు చేసింది ఏమైనా ఉందా అని చంద్రబాబును ఆయన ప్రశ్నించారు?
 
ప్ర‌త్యేక హోదాకోసం చంద్ర‌బాబు త‌మ ఎంపీల‌తో రాజీనామా చేయించి కేంద్రానికి వ్య‌తిరేకంగా ధ‌ర్నాలు చేయించ‌కుండా డ్రామాలు ఆడుతున్నార‌ని ఆయ‌న నిల‌దీశారు... మీకు ద‌మ్ము ధైర్యం లేదు కాబట్టే మీ ఎంపీల‌తో రాజీనామా చేయించ‌లేద‌ని ముద్ర‌డ‌గ మండిప‌డ్డారు.. 2014 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబుకు  ఓటు వేసిన ప్ర‌జ‌లంద‌రూ సిగ్గుప‌డాల‌ని, అలాగే తాను కూడా టీడీపీకి ఓటు వేసి సిగ్గుప‌డుతున్నాన‌ని ఆయ‌న అన్నారు.
 
త‌న కంఠంలో ఊపిరి ఉన్నంత వ‌రకూ చంద్ర‌బాబును అలాగే తెలుగుదేశం పార్టీని న‌మ్మ‌న‌ని అన్నారాయ‌న‌... తాము కాపు రిజ‌ర్వేష‌న్ల‌కోసం శాంతి యుతంగా నిర‌స‌న తెలుపుతామ‌ని చెబితే, ఏపీ ప్ర‌భుత్వం అనుమ‌తి ఇవ్వ‌లేద‌ని గుర్తుచేశారు..అయితే  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపైన ధర్నాలు చేయడానికి మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారంటూ మండిపడ్డారు... చీక‌టి రాజ‌కీయాలు చేయ‌డంలో ముఖ్య‌మంత్రి పెద్ద‌ దిట్ట అని అత‌నిని ఎవ‌రు క్ష‌మించ‌వ‌ద్ద‌ని ప్ర‌జ‌ల‌కు సూచించారు ముద్ర‌గ‌డ‌.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.