ముద్ర‌గ‌డ అలా చేస్తేజ‌గ‌న్ కు ప్ల‌స్సే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-02 11:14:47

ముద్ర‌గ‌డ అలా చేస్తేజ‌గ‌న్ కు ప్ల‌స్సే

కాపు ఉద్య‌మ నేత మాజీ ఎంపీ ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం మరికొద్ది రోజుల్లో అధికార తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో టీడీపీ తీర్థం తీసుకోనున్నార‌నే వార్త ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో కోడై కూస్తోంది. అంతేకాదు ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎంపీగా ఎక్క‌డ‌ నుంచి పోటీ చేస్తాను అన్నా కూడా టీడీపీ అధిష్టానం ఆయ‌న‌కు టికెట్ట ఇచ్చేందుకు సిద్దంగా ఉంద‌ని తెలుస్తోంది.
 
గ‌డిచిన ఎన్నిక‌ల్లో టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు తాను అధికారంలోకి వ‌చ్చిన ఆరు నెల‌ల‌కే బీసీల‌కు అన్యాయం జ‌రుగ‌కుండా కాపుల‌ను బీసీల్లో చేర్చుతామ‌ని హామీ ఇచ్చారు. దీంతో రాష్ట్రంలో ఉన్న కాపు కుల‌స్తులు అంద‌రూ టీడీపీకి ఓట్లు వేసి చంద్ర‌బాబును ముఖ్య‌మంత్రి చేశారు. అయితే ఆయ‌న అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి నేటి వ‌ర‌కు కాపుల రిజ‌ర్వేష‌న్ల‌పై ఒక్క‌సారి కూడా ప్ర‌స్తావించ లేదు దీంతో ముద్ర‌గ‌డ కాపు రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు  నీరు కారుస్తున్నార‌నే ఉద్దేశంతో కాపు సంఘాల నాయకుల‌తో క‌లిసి ధ‌ర్నాలు దీక్ష‌లు చేయ‌బోతే అధికార బ‌లంతో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కుమారుడు మంత్రి నారా లోకేశ్ త‌న‌ను హౌస్ అరెస్ట్ చేసి త‌న‌ను లం...కొడకా అని తిట్టార‌ని, అలాగే త‌న కుమారుడిని, కోడ‌లిని ఇష్టం వ‌చ్చిన‌ట్లు తిట్టారని ఆయ‌న గతంలో చెప్పారు.
 
త‌న‌ను ఎన్ని మాట‌లు అన్నా కూడా ప‌ట్టించుకోన‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఇచ్చిన హామీని నెర‌వేర్చేదాక పోరాడుతూనే ఉంటాన‌ని చెప్పారు. అందులో భాగంగానే ప్ర‌తీ  విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ ముఖ్య‌మంత్రి కార్యాలాయానికి లేఖ రాసేవారు. టీడీపీ అధిష్టాన్ని ప్ర‌త్య‌క్షంగా అలాగే లేఖ‌ల ద్వారా విమ‌ర్శించే ముద్ర‌గ‌డ ఇప్పుడు చంద్ర‌బాబు స‌మ‌క్షంలో టీడీపీ తీర్థం తీసుకోబోతున్నారు అని వార్తలు వస్తున్నాయి. ఒక వేళ ఆయ‌న టీడీపీ తీర్థం తీసుకుంటే కాపు రిజ‌ర్వేష‌న్ల వ్య‌హారం అనూహ్యంగా మ‌లుపులు తీరిగిన‌ట్లే. ఎందుకంటే ఇన్నాళ్లు కాపు రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో ముందుండి ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించిన ముద్ర‌గ‌డ ఇప్పుడు టీడీపీలో చేరితే రాజ‌కీయంగా ల‌బ్ది పొందొచ్చు కానీ, కాపు కుల‌స్తుల్లో తీవ్ర వ్య‌తిరేకత పెరిగి పోతుంది. 
 
ఇక మ‌రో వైపు తాను 2019లో అధికారంలోకి వ‌స్తే కాపు రేజర్వేషన్ల విషయం కేంద్రం ప‌రిధిలోనిది కాబ‌ట్టి నేను రిజ‌ర్వేష‌న్లు ప్ర‌క‌టిస్తాన‌ని చెప్ప‌లేన‌ని, కానీ తాను కాపుల‌కు వ్య‌తిరేకం కాద‌ని, ప్ర‌స్తుత ప్ర‌భుత్వం కాపు కార్పోరేష‌న్ కు ఎంత మేర‌కు నిధుల‌ను కేటాయిస్తుందో తాను అంత‌కంటే రెట్టింపు ఇస్తాన‌ని  వైఎస్ జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. దీంతో కాపులు జ‌గ‌న్ ప్ర‌క‌టించిన హామీలు ఫ్లకాడ్స్ ప‌ట్టుకుని స‌గ‌ర్వంగా ఆహ్వానించారు. 
 
కాపు రిజ‌ర్వేష‌న్ల‌పై జ‌గ‌న్ త‌న అభిప్రాయాన్ని చెప్పినందుకు కాపులు ఆహ్వానించారు కానీ ముద్ర‌గ‌డ ఆహ్వానించ‌లేదు. సో దీని బ‌ట్టి మ‌రి కొన్ని రోజుల్లో ఆయ‌న టీడీపీ తీర్థం తీసుకోనున్న‌రని ఉభయగోదావరి జిల్లాలలో వార్తలు వస్తున్నాయి. ముడ్ర‌గ‌డ టీడీపీ తీర్థం తీసుకున్న, తీసుకోక పోయినా జ‌గ‌న్ కు ప్ల‌స్సే అని తెలుస్తుంది. ఎందుకంటే కాపుకుల‌స్తులంద‌రూ జ‌గ‌న్ ప్ర‌క‌టించిన హామీని ఆహ్వానించారు. ఒక వేల ముద్రగడ టీడీపీ తీర్థం తీకుకుంటే కాపుల్లో కూడా విశ్వాసం కోల్పోయే అవకాశాలున్నాయి. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.