సీబీఐ విచార‌ణ చేయండి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-12 14:48:43

సీబీఐ విచార‌ణ చేయండి

అవినీతి చేయ‌డంలో చంద్ర‌బాబును మించిన‌వారు లేర‌ని, అవినీతిలో సామ్రాట్ చంద్ర‌బాబు అని ఆయ‌న చేసిన అక్ర‌మాలపై అవినీతి పై విచార‌ణ చేప‌ట్టాలి అని కాపు ఉద్య‌మ‌నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ప్ర‌ధానికి లేఖ రాశారు.సీఎం చంద్ర‌బాబు పై సీబీఐ, ఇన్‌కంట్యాక్స్, ఈడీ తదితర శాఖల ద్వారా ఏకకాలంలో దర్యాప్తు చేయించి ఏపీని ప్ర‌జ‌ల‌ను కాపాడాలి అని ఆయ‌న లేఖ‌లో పేర్కొన్నారు.
 
ఏపీకి ప్ర‌త్యేక‌హూదా ఇస్తాము అని గ‌తంలో అన్నారు, కాని ఇవ్వ‌లేదు. ఇక ప్ర‌త్యేక హూదా ప్యాకేజీ గురించి మీ ఇద్ద‌రి మ‌ధ్య‌ ఎటువంటి ఒప్పందం జ‌రిగిందో తెలియ‌దు కాని హూదా సాధించాలి అనే కోరిక‌తో ప్ర‌జాధ‌నాన్ని దారుణంగా ఏపీ ప్ర‌జ‌లకు, రాష్ట్ర ఖ‌జానాకు న‌ష్టం చేకూరుతోంది అని ఆయ‌న లేఖ‌లో తెలియ‌చేశారు.
 
ఈ ముఖ్య‌మంత్రిని ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయినా అరెస్ట్ చేయ‌కుండా కాపాడ‌టం చాలా పెద్ద త‌ప్పు అని అన్నారు.చంద్ర‌బాబుని ఆరోజే జైలుకి పంపించి ఉంటే, ఇలా న‌ష్టం జ‌రిగి ఉండేది కాద‌ని అన్నారు.పోల‌వ‌రం లో ఎంతో అవినీతి జ‌రిగింది అని తెలియ‌చేశారు. ఇక ఇసుక‌ను కూడా దోపిడిగా దోచేస్తున్నారు అని ఆయ‌న అన్నారు. 
 
కోట్ల రూపాయ‌ల దోపిడి ఇసుక విష‌యంలో జ‌రిగింది అని అన్నారు ఆయ‌న‌. వారి పార్టికి చెందిన వారికి మాత్ర‌మే అభివృద్ది ఫ‌లాలు అందుతున్నాయి అని అన్నారు.ఈ మధ్య హోదా పోరాటం పేరుతో గత నెల 20న పుట్టిన రోజుకి, 30న పెళ్లి రోజుకి జరిపిన వేడుకల సభలకి ప్రజాధనాన్ని వెచ్చించడం క్షమించరాని నేరమన్నారు.
 
రాష్ట్ర ఆర్దిక ప‌రిస్దితి బాగోలేదు అని చెబుతూ, పేద రాష్ట్రం అని చెబుతూ, ఇక్క‌డ దోపిడిచేస్తూ అవినీతికి దారులు తెరిచారు అని విమ‌ర్శించారు.గ‌తంలో ఏపీకి ఇచ్చిన ప్రత్యేక హోదాను, రైల్వే జోన్, కడప స్టీల్‌ ప్లాంట్ తో పాటు విభజన సందర్భంగా ఇచ్చిన హామీల్లో మిగిలిన హామీలు అమలు చేయాలని లేఖలో కోరారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.