వింత రాజకీయం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-30 11:33:55

వింత రాజకీయం

రాయలసీమలో వింత రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం కోనేటమ్మపల్లికి చెందిన ప్రముఖ నాయకుడు రఘురామిరెడ్డిపై కర్నూలులో ప్రత్యర్థులు హత్యాయత్నం చేశారు.

నంద్యాల చెక్ పోస్టు సమీపంలోని నందికొట్కూరు రోడ్డులో ఉన్న దాబా ఎదుట మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో రఘురామిరెడ్డి, అతడి అనుచరులు జగదీశ్వరరెడ్డి, భరత్కుమార్రెడ్డిలతో కలసి ఉన్నారు. ఇంతలో ముఖానికి మాస్కులు ధరించిన ఐదారుగురు వ్యక్తులు బైక్లపై వచ్చి కత్తులు, రాడ్లతో రఘురామిరెడ్డిపై విచక్షణరహితంగా దాడి చేశారు.

అయితే దాడికి గురైన రఘురామి రెడ్డిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత గౌరు వెంకట్ రెడ్డి పరామర్శించడం జరిగింది. ఈ వైసీపీ నాయకుడు రఘురామి రెడ్డి హత్యాయత్నానికి కారణం ముమ్మాటికి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, బై రెడ్డి సిద్దార్ధ్ రెడ్డి అంటూ గౌరు వెంకట్ రెడ్డి ఆరోపణలు చేశారు. .

మరోవైపు మాజీ ఎమ్మెల్యే బై రెడ్డి రాజశేఖర్ రెడ్డి కూడా రామి రెడ్డిని పరామర్శించారు. ఈ హత్యాయత్నానికి తనకు ఏలాంటి సంబంధం లేదని, రామి రెడ్డి నా అనుచరుడని బై రెడ్డి అంటున్నారు. నిజా నిజాలు తెలుసుకుని మాట్లాడాలని ఆయన మండిపడ్డారు. అదే విధంగా టీడీపీలో ఎప్పుడు చేరబోయేది కూడా త్వరలో ప్రకటిస్తానని అన్నారు

ఇక టీడీపీ నేతలు సైతం రఘురామి రెడ్డి హత్యాయత్నాoపై స్పందించారు. టీడీపీ క్రియాశీలక నేత రఘురామి రెడ్డిపై హత్యాయత్నం జరగడం దారుణమని అంటున్నారు. ఇలా ఎవరికి వారు వారి వారి పార్టీ నేతలుగా రఘురామి రెడ్డిని ప్రకటించుకున్నారు. మరి ఈ హత్యకు కారణం ఎవరు....?అసలు రఘరామి రెడ్డి ఏ పార్టీకి చెందిన వాడు...?

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.