అమరావతికి ముఖేశ్‌ అంబానీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-13 03:26:37

అమరావతికి ముఖేశ్‌ అంబానీ

రిలయన్స్ అధినేత ముఖేశ్‌ అంబానీ అంటే దేశంలో తెలియ‌ని వారుండ‌రు. వ్యాపార‌ రంగంలో త‌న‌దైన శైలిలో రాణించి అతి త‌క్కువ స‌మ‌యంలో ప్ర‌పంచ పారిశ్రామిక వేత్త‌ల్లో స్థానం సంపాదించుకున్నారు అంబానీ. ప్ర‌తి సంవ‌త్స‌రం ప్ర‌క‌టించే ప్ర‌పంచ‌ ఆర్థిక కుబేరుల జాబితాలో   స్థానం సంపాదిస్తున్నారు.  అంబానీ పెట్టుబ‌డులు పెట్టిన చోట పారిశ్రామిక అభివృద్దితో పాటు, కొన్ని వేలమంది నిరుద్యోగుల‌కు ఉపాధి క‌ల్పిస్తున్న‌ది రిలియ‌న్స్ సంస్థ‌.
 
ఏపీలో పెట్టుబ‌డులు పెట్ట‌డానికి ఉన్న స‌దుపాయాల గురించి  ముంబై పర్యటనలో మంత్రి లోకేశ్ అంబానికి వివ‌రించి..... త‌మ రాష్ట్రానికి రావాల‌ని ఆహ్వ‌నించారు. దీంతో  ఏపీ రాజ‌ధాని అమ‌రావతి ప‌ర్య‌ట‌న‌కు ముఖేశ్‌ అంబానీ నేడు రానున్నారు. ప‌ర్య‌ట‌న అనంత‌రం సీఎం చంద్ర‌బాబుతో భేటీ అయి పెట్టుబ‌డులు పై చ‌ర్చించి ఒప్పందాలు చేసుకునే అవ‌కాశం ఉంది.  ఈ కార్య‌క్ర‌మంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు స‌మావేశం అవనున్నారు.
 
ఏపీ స‌చివాల‌యం నుంచి పాల‌నా విధానాన్ని గ‌మ‌నిస్తూ... ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే రియల్ టైం గవర్నెన్స్ (ఆర్టీజీ) వేదిక‌ను ముఖేష్ అంబానీ పరిశీలించనున్నారు. చివ‌ర‌గా ముఖ్యమంత్రి నివాసంలో విందుకు హాజ‌ర‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.