టీడీపీ ప‌ద‌వికి రాజీనామా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-01 15:10:03

టీడీపీ ప‌ద‌వికి రాజీనామా

సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న త‌రుణంలో తెలుగుదేశం పార్టీ నాయ‌కుల్లో విభేదాలు ర‌చ్చ‌కెక్కుతున్నాయి.  ఆ పార్టీ నేత‌ల తీరుకు సాధార‌ణ టీడీపీ కార్య‌క‌ర్త‌లు సైతం స‌త‌మ‌త‌వుతున్నారు. అయితే ఇప్ప‌టికే ఈ వ‌ర్గ విభేదాలు రాయ‌ల‌సీమ వ్యాప్తంగా తారా స్థాయికి చేరుకున్న సంగ‌తి తెలిసిందే. ఇక‌ ఇదే క్ర‌మంలో వ‌ర్గ విభేదాలు కోస్తాంధ్రాకు కూడా తాకాయి.
 
తూర్పు గోదావ‌రి జిల్లా ముమ్మిడివ‌రం నియోజ‌కవ‌ర్గంలో టీడీపీ ఎమ్మెల్యే బుచ్చిబాబు వైఖ‌రికి గ‌త కొద్ది కాలంగా టీడీపీ నాయ‌కుల‌తో పాటు నియోజ‌కవ‌ర్గ ప్ర‌జ‌లు కూడా అసంతృప్తితో ఉన్నారు. ఇక ఆయ‌న వైఖ‌రిని చూసి చాలా మంది సైకిల్ పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. అయితే ఇదే క్ర‌మంలో మునిసిపల్ చైర్మన్ శాంతకుమారి కూడా బుచ్చిబాబు వైఖ‌రి చూసి త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు.
 
రాజీనామా చేసిన త‌ర్వాత ఆమె మాట్లాడుతూ, ఎమ్మెల్యే బుచ్చిబాబు వైఖరిని సహించలేకపోతున్నాన‌ని ఆమె వాపోయారు. ఎస్సీ రిజర్వుడు నగర పంచాయితీ చైర్మన్ స్థానం తనకు కేటాయించిన నాటి నుంచి ఎమ్మెల్యే సహకరించడం లేదని, టీడీపీ నేతల తీరుతో మనస్తాపం చెందానని అందుకేతాను త‌న ప‌ద‌వికి రాజీనామా చేశాన‌ని ఆమె తెలిపారు. 
 
ఇక మ‌రోవైపు ముమ్మిడివ‌రం నియోజ‌కవ‌ర్గంలో ప్ర‌తిప‌క్ష వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ సామాజిక స‌మీక‌ర‌ణాల‌తో ముందుకు సాగుతోంది. వీరికి పోటీగాఅధికార నాయ‌కులు పోటీ చేయాల్సిందిపోయి విభేదాల‌తో వీధిన ప‌డ‌టం ఏంట‌ని మ‌రికోంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. మొత్తానికి ఈ నియోజ‌కవ‌ర్గంలో టీడీపీ విభేదాలు ర‌చ్చ‌కెక్క‌డంతో  ప్ర‌జ‌లంతా బుచ్చిబాబుపై అసంతృప్పితో ఉన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.