వైసీపీ ఆధ్వ‌ర్యంలో దీక్ష‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp
Updated:  2018-09-06 12:20:10

వైసీపీ ఆధ్వ‌ర్యంలో దీక్ష‌

మైనార్టీ యువ‌కుల‌పై టీడీపీ స‌ర్కార్ పెట్టిన కేసుల‌ను ఎత్తి వెయ్యాల‌ని కోరుతూ ప్ర‌తిపక్ష‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్ రెడ్డి డిమాండ్ చేస్తూ త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఒక్క రోజు దీక్ష‌కు దిగారు. ఇక ఆయ‌న చేప‌ట్టిన దీక్ష‌కు మ‌ద్ద‌తుగా ముస్లింలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్య‌క‌ర్త‌లు పెద్దఎత్తున దీక్ష‌లో పాల్గొన్నారు. 
 
ప్ర‌జ‌ల నిర‌స‌న‌ల‌పై ఉక్కుపాదం మోప‌డానికి చంద్ర‌బాబు స‌ర్కార్ అక్ర‌మ కేసుల‌ను బ‌నాయిస్తుంద‌ని రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్ రెడ్డి ఆరోపించారు. ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ను జీర్ణించుకోలేక ప్ర‌జ‌ల‌ను బ‌య‌పెట్ట‌డానికి చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. 2014 ఎన్నిక‌ల్లో టీడీపీకి ముస్లింలు ఓట్లు వేస్తే వారికి దోహ‌ద‌ప‌డ‌తాన‌ని చంద్ర‌బాము హామీ ఇచ్చార‌ని కానీ వాటిని నెర‌వేర్చ‌లేద‌ని ఆయ‌న అరోపించారు. 
 
ఇక ఇప్పుడు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో గుంటూరులో వారిని పిలిపించుకుని ఇంకా అభివృద్ది కార్య‌క్ర‌మాలు చేస్తాన‌ని మ‌రోసారి మ‌భ్య‌పెట్టాల‌ని చూస్తే దానిని వ్య‌తిరేకించిన తొమ్మిది మంది యువ‌కుల‌పై అక్ర‌మ‌కేసులు పెట్టార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. అయితే ఈ కేసుల‌ను వెంట‌నే తొల‌గించాల‌ని డిమాండ్ చేస్తూ రాచ‌మల్లు ఒక్క‌రోజు దీక్ష‌కు దిగారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.