బికాంలో ఫిజిక్స్ కు వ్య‌తిరేకంగా ధ‌ర్నా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-31 18:32:23

బికాంలో ఫిజిక్స్ కు వ్య‌తిరేకంగా ధ‌ర్నా

2014లో తెలుగుదేశం పార్టీ  అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇంచార్జ్ లు, అలాగే అధికార ప్ర‌లోభాల‌కు ఆశ‌ప‌డి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో టీడీపీ తీర్థం తీసుకున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలు అవినీతే ల‌క్ష్యంగా చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా విచ్చ‌ల‌విడిగా అవినీతికి పాల్ప‌డుతున్నారు. అధికారంలో ఉండి చేస్తున్న వీరి అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయింది. 
 
అయితే ఇదే క్ర‌మంలో మ‌రోసారి టీడీపీ నాయ‌కుల అవినీతి గుట్టుర‌ట్టు అయింది. విజ‌య‌వాడ ఫిరాయింపు ఎమ్మెల్యే వ‌క్ఫ్ బోర్డ్ చైర్మ‌న్ జ‌లీల్ ఖాన్ అవినీతికి వ్య‌తిరేకంగా నేడు ముస్లీం సంఘాల నాయ‌కులు, సీపీఐ నేత‌లు క‌ల‌సి జుమ్మా మ‌సీద్ వ‌ద్ద నిర‌సన‌లు చేప‌ట్టారు. ఈ నిర‌స‌న‌లో ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్ ముస్లీం ద్రోహి అంటూ నిదాలు చేశారు. వంద కోట్లు విలువ చేసే మ‌సీద్ స్థ‌లాన్ని ఎమ్మెల్యే త‌క్క‌వ ధ‌ర‌కే లీజుకు ఇస్తున్నార‌ని వామ‌ప‌క్షాలు మండిప‌డ్డాయి. ఇప్ప‌టికైనా జ‌లీల్ ఖాన్ త‌న మ‌న‌సు మార్చుకోవాల‌ని లేక‌పోతే ఈ ఉద్య‌మాన్ని ఉద్రిక్తం చేస్తామ‌ని మైనార్టీలు హెచ్చ‌రిస్తున్నారు
 
ఇక ఈ నిర‌స‌న అదుపు త‌ప్ప‌డంతో హూటా హూటిన పోలీసులు అక్క‌డికి చేరుకుని వారిని అరెస్ట్ చేశారు. అక్ర‌మంగా మ‌సీద్ స్థ‌లాన్ని త‌క్కువ ధ‌ర‌కు క‌ట్ట‌బెడుతున్నార‌ని ముస్లిం సంఘాలు పెద్ద ఎత్తున మ‌సీదు ద‌గ్గ‌ర నిర‌న‌లు చేయ‌డంతో వ‌క్ఫ్ బోర్డ్ చైర్మ‌న్ జ‌లీల్ ఖాన్ వెన‌క్కి త‌గ్గారు.
 
ఈ ప‌రిస్థితి రానున్న రోజుల్లో మ‌రింత ఉద్రిక్తం కానుంద‌నే ఉద్దేశంతో జ‌లీల్ ఖాన్ హూటా హుటిన మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి జుమ్మామ‌సీదు స్థ‌లం లీజు టెండ‌ర్ల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. కాగా నిన్న మంత్రి గంటా ఇంటిముందు మ‌ధ్యాహ‌న్న భోజ‌నం ప‌థ‌కం కింద ప‌నిచేసి మ‌హిళ‌లు పెద్దఎత్తున ఆందోళ‌న చేసిన సంగ‌తి తెలిసిందే.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.