వైసీపీలో చేరిన బ‌డా బిజినెస్ మేన్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-25 12:33:41

వైసీపీలో చేరిన బ‌డా బిజినెస్ మేన్

ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌ను ఏ ముహూర్తాన మొద‌లు పెట్టారో కానీ, టీడీపీ నుంచి వైసీపీలోకి విప‌రీతంగా  వ‌ల‌స‌లు పెరుగుతున్నాయి. ఒక‌ప్పుడు అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కుల ప్ర‌లోభాల‌కు ఆశ‌ప‌డి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో టీడీపీ తీర్థం తీసుకున్న సంగ‌తి తెలిసిందే.
 
అయితే వైఎస్ జ‌గ‌న్ 2019 ఎన్నిక‌ల్లో అధికార‌మే ల‌క్ష్యంగా చేసుకుని త‌న సొంత జిల్లా వైయ‌స్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గం ఇడుపులపాయలో  నవంబర్‌ 6, 2017 న ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌ను మొద‌లు పెట్టారు. ఈ సంక‌ల్ప‌యాత్ర మొద‌లు అయిన‌ప్ప‌టి నుంచి వైసీపీలోకి వ‌ల‌స‌లు విప‌రీతంగా పెరుగుతున్నాయి. ఇక‌ ఈ వ‌ల‌స‌లను త‌గ్గించేందుకు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు శ‌త విధాలుగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నా కానీ వైసీపీలోకి వ‌ల‌స‌లు ఆగ‌డంలేదు.
 
ఇక‌ ఇప్ప‌టికే  కృష్ణా జిల్లాకు చెందిన‌ టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు య‌ల‌మంచిలి ర‌వి, అలాగే ప్ర‌ముఖ‌ పారిశ్రామికవేత్త కృష్ణప్రసాద్‌, తన తండ్రి మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు క‌లిసి వైసీపీలో చేరిన సంగ‌తి తెలిసిందే. ఇక ఇదే క్ర‌మంలో అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి ప్ర‌ధాన అనుచ‌రుడు కోగ‌టం విజ‌య భాస్క‌ర్ రెడ్డి త‌న అనుచ‌రుల‌తో క‌లిసి జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకున్నారు.
 
ఇక తాజాగా వైఎస్ జ‌గ‌న్ త‌ల పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర ప్ర‌స్తుతం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఉంగ‌టూరు నియోజ‌కవ‌ర్గంలో నిర్విరామంగా కొన‌సాగుతోంది. ఈ పాద‌యాత్ర‌లో భాగంగా విశాఖపట్నంకు చెందిన ఎంవీబీ బిల్డర్స్‌ అధినేత సత్యనారాయణ ఆయ‌న అనుచ‌రుల‌తో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌లిసి ఆయ‌న స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకున్నారు.
 
వైసీపీలో చేరిన త‌ర్వాత సత్యనారాయణ మాట్లాడుతూ, విశాఖలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కోసం తనవంతు కృషి చేస్తానని అన్నారు. ఒక‌ప‌క్క ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుకుంటూ మ‌రోప‌క్క ఎర్ర‌ని ఎండ‌ని సైతం లెక్క‌చేయ‌కుండా జ‌గ‌న్ పాద‌యాత్ర చేప‌డుతున్నార‌ని ఆయ‌న ఆన్నారు.  జగన్‌ లాంటి ప్రజాదరణ కలిగిన నాయకుడు ఈ రాష్ట్రంలో ఎవరూ లేరని, ఆయన నాయకత్వంలో పనిచేసేందుకు తాను పార్టీలో చేరాన‌ని చెప్పారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.