వైసీపీలో చేరిన జ‌గ‌న్ మిత్రుడు ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-16 14:35:58

వైసీపీలో చేరిన జ‌గ‌న్ మిత్రుడు ?

క‌డ‌ప జిల్లాలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగుర‌వేయాలి అని తెలుగుదేశం ఎప్ప‌టి నుంచో ఆలోచ‌న చేస్తుందో ఇక ఫిరాయింపుల‌తో ఇక్క‌డ త‌న జెండా ఎగుర‌వేయాల‌ని వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ ఫిరాయింపుల ద్వారా జ‌గ‌న్ కోట‌లో పాగా వెయ్యాలి అని ప్లాన్ వేసింది.. ఇటు సీఎం ర‌మేష్, ఆదినారాయ‌ణ రెడ్డికి క‌డ‌ప జిల్లా రాజ‌కీయాల‌ను అప్ప‌గించారు తెలుగుదేశం అధినేత‌. అయితే జ‌గ‌న్ ప్రజాసంక‌ల్ప‌యాత్ర‌కు ఎటువంటి మ‌ద్ద‌తు ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిందో క‌డ‌ప అంతా తెలిసిందే.
 
ఇక గుంటూరు జిల్లాలో కూడా జ‌గ‌న్ కు ప‌లువురు బ్ర‌హ్మ‌ర‌థం పట్టారు ఇటు ఇటీవ‌ల జ‌గ‌న్ స‌మ‌క్షంలో పొన్నాడ స‌తీష్ అలాగే య‌ల‌మంచిలి ర‌వి పార్టీలో చేరారు అలాగే క‌డ‌ప నుంచి మ‌రో యువ నాయకుడు వైసీపీలో  చేరారు.మాజీ మంత్రి ఎంవీ మైసూరారెడ్డి త‌న‌యుడు హ‌ర్ష‌వ‌ర్ద‌న్ రెడ్డి వైసీపీలో చేరారు.ఆయ‌న వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ  ఎర్రగుంట్ల సమన్వయ కర్త సుధీర్‌ రెడ్డి ఆధ్వర్యంలో  పార్టీలో చేరారు. 
 
వైసీపీలో కొన్ని సంవ‌త్స‌రాలు ప‌నిచేసి బ‌య‌ట‌కు వెళ్లిపోయిన మైసూరా రెడ్డి  ఆ త‌ర్వాత వైసీపీకి రాజీనామా చేశారు.ఇక ఆయ‌న తెలుగుదేశంలో చేరుతారు, పార్టీకి సేవ చేయ‌డానికి ఆయ‌న్ని నాయ‌కులు ఆహ్వానించారు అని అంద‌రూ చ‌ర్చించుకున్నారు.... ఏపీలో తెలుగుదేశాన్ని  ప్ర‌జ‌లు నమ్మ‌క‌పోవ‌డంతో ఆయ‌న తెలుగుదేశంలో చేరే ఆలోచ‌న విర‌మించుకున్నారు అని తెలుస్తోంది. ఇక ఆయ‌న కుమారుడు హ‌ర్ష వ‌ర్ధ‌న్ రెడ్డి జ‌గ‌న్ కు ఎప్ప‌టి నుంచో మిత్రుడు. వీరి మ‌ధ్య స్నేహం ఉంది... అయితే  తండ్రి కోసం ఇన్ని రోజులు ఆగిన హ‌ర్ష‌వ‌ర్ద‌న్ రెడ్డి తాజాగా వైసీపీలో చేరాల‌ని భావించి ఆయ‌న వైసీపీలో చేరారు.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.