వైసీపీలోకా జ‌న‌సేన‌లోకా ర‌హ‌స్య భేటీ కార‌ణం ఇదేనా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

nadendla manohar and ysrcp and janasena
Updated:  2018-06-23 05:46:31

వైసీపీలోకా జ‌న‌సేన‌లోకా ర‌హ‌స్య భేటీ కార‌ణం ఇదేనా

తెలుగు రాష్ట్రాల విభ‌జ‌న త‌ర్వాత 2014లో మొద‌టిసారిగా సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రిగాయి. ఆ ఎన్నిక‌ల్లో జాతీయ కాంగ్రెస్ పార్టీ ఇటు ఆంధ్రాలోనూ అటు కోస్తాలోనూ ఘోర ప‌రాజ‌యం ఎదుర్కొంది. ఇక రానురాను కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ప్ర‌జ‌లు మ‌రిచిపోతుండ‌టంతో పార్టీలో ఉన్న నాయ‌కులంద‌రూ పాద‌యాత్ర చేస్తున్న వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇక మిగిలిన కొంత మంది కాంగ్రెస్ నాయ‌కులు నాలుగు సంవ‌త్స‌రాల పాటు రాజకీయాల‌కు దూరంగా ఉంటూ వచ్చారు.
 
ఇక 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న‌త‌రుణంలో రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్న కాంగ్రెస్ నాయ‌కులు ఏపీలో జోరుగా ఉన్న పార్టీలోకి ఒకరాయి విసురుతున్నారు. ఆ రాయి త‌గిలితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ త‌ర‌పున టికెట్ కేటాయిస్తే తాము పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నామ‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. ఇదే క్ర‌మంలో మాజీ కాంగ్రెస్ పార్టీ లోక్ స‌భ స్పీక‌ర్ నాదెండ్ల మ‌నోహ‌ర్ కూడా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ద‌మ‌య్యార‌ని వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.
 
అయితే మొద‌ట్లో మ‌నోహ‌ర్ వైసీపీలో చేరుతున్నార‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు వచ్చాయి. కానీ ఈ విష‌యంపై ఆయ‌న స్పందించ‌లేదు. దీంతో ద‌రిదాపుగా వైసీపీలో చేర‌డం ఖాయ‌మ‌ని ప్ర‌తీ ఒక్క‌రు భావించారు. అయితే ఊహించ‌ని ప‌రిణామాల నేప‌థ్యంలో నాదెండ్ల మ‌నోహ‌ర్ జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో నేడు భేటీ అయ్యారు. ఆయ‌న అంత స‌డ‌న్ గా ఎందుకు భేటీ అయ్యారో ఇరువ‌ర్గాల నుంచి ఇంత వ‌ర‌కూ స్ప‌ష్ట‌త రాలేదు.
 
అయితే విస్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం మ‌రికొద్ది రోజుల్లో జ‌న‌సేన పార్టీ లో చేరేందుకు సిద్ద‌మ‌య్యార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. పోయినంత కాలం కాంగ్రెస్ పార్టీలో ఉంటే మాజీగానే ఉండిపోవాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంద‌ని భావించి ఆయ‌న  జ‌న‌సేన పార్టీలో చేరేందుకు సిద్ద‌మ‌య్యార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. కానీ ఈ విష‌యంపై మ‌నోహ‌ర్  క్లారిటీ ఇవ్వ‌లేదు. చూడాలి మ‌రి ఎన్నిక‌ల స‌మ‌రానికి ఇంకా ప‌దినెల‌లు ప‌మ‌యం ఉంది ఈలోగా వైసీపీలో చేరుతారా..! లేక జ‌న‌సేన పార్టీ లో చేరుతారా ! అన్న‌ది పెద్ద ప్ర‌శ్న‌గా మారింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.