బీజేపీకి మ‌రో ఊహించ‌ని షాక్....

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-21 11:31:22

బీజేపీకి మ‌రో ఊహించ‌ని షాక్....

దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్న భార‌తీయ జ‌న‌తాపార్టీకి తెలుగు రాష్ట్రాల్లో ఊహించ‌ని ప‌రిణామాలు ఎదుర‌వుతున్నాయి. విభ‌జ‌న చ‌ట్టంలోని హామీల‌ను నెర‌వేర్చలేదంటూ  ఏపీలో రాజ‌కీయ పార్టీలు బీజేపీపై యుద్దం ప్ర‌క‌టించాయి. 
 
ఇక తెలంగాణ‌లో కూడా బీజేపీకి ఊహించ‌ని షాక్ త‌గిలింది. గత కొన్ని రోజులుగా నాగం జ‌నార్ధ‌న్ రెడ్డి  బీజేపీకి అంటిముట్ట‌నట్లుగా ఉంటున్నారు. అంతేకాదు సొంత పార్టీపైనే మీడియా వేదిక‌గా ఆయ‌న బ‌హిరంగంగా అసంతృప్తిని వ్య‌క్తం చేశారు. 
 
దీంతో నాగం కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవుతున్న‌ట్లు అనేక వార్త‌లు వ‌చ్చాయి. మ‌రికొన్ని రోజుల్లోనే ఈ  వార్త‌లు నిజ‌మ‌య్యేలా కనిపిస్తున్నాయి. నాగం కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యేందుకు అన్ని ఏర్పాట్లు  పూర్తి చేసుకున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. 
 
ఈ విషయమై రెండు రోజుల క్రితమే టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డితో కలిసి పార్టీ జాతీయధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యార‌ట నాగం జ‌నార్ధ‌న్ రెడ్డి. కాగా టీడీపీతో  తన రాజకీయ ప్ర‌స్ధానాన్ని ప్రారంభించిన నాగం జనార్ధన్ రెడ్డి  ఏపీ విభ‌జ‌న నేప‌ధ్యంలో చోటు చేసుకున్న ప‌రిణామాల కార‌ణంగా  బీజేపీలో చేరారు. 
 
అయితే, బీజేపీలో చేరిన కొద్ది రోజుల నుంచే ఆ పార్టీ కార్యాక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. వ‌చ్చే నెలలో రాహుల్ గాంధీ స‌మ‌క్షంలో నాగం జ‌నార్ధ‌న్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్న‌ట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో తెలంగాణ‌లో మ‌రికొంద‌రు పార్టీ మారే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.