జ‌గ‌న్ స‌మ‌క్షంలో భారీ చేరిక‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-19 14:55:00

జ‌గ‌న్ స‌మ‌క్షంలో భారీ చేరిక‌లు

ఏపీ ప్ర‌తిక్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లో భాగంగా 2019 లో వైసీపీ అధికారంలోకి వ‌స్తే తాను అమ‌లు చేయ‌బోయే హామీల‌ను మాత్ర‌మే ప్ర‌క‌టిస్తూ ఏ నాయ‌కుడు పొంద‌లేని రీతిలో ప్ర‌జ‌ల మ‌న్న‌న‌ల‌ను పొందుతున్నారు ఆయ‌న‌.
 
అంతేకాదు జ‌గ‌న్ ప్ర‌క‌టిస్తున్న హామీల‌ను చూసి అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన కీల‌క నాయ‌కులు, అలాగే గ‌తంలో రాజకీయంగా ఓ వెలుగు వెలిగిన ఇత‌ర పార్టీల‌కు చెందిన నాయ‌కులు కూడా జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకున్నారు. అయితే వారంద‌రూ చెప్పేది ఒక్క‌టే.. తాము జ‌గ‌న్ పాద‌య‌త్ర‌లో ప్ర‌క‌టిస్తున్న‌ హామీల‌కు ఆక‌ర్షితులై వైసీపీలోచేరుతున్నామ‌ని చెబుతున్నారు. 
 
ఇక ఇదే క్ర‌మంలో నాయీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు  సిద్దవటం యానాదయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావులకొల్లు మల్లేశ్వరరావులు తూర్పు గోదావ‌రి జిల్లా  కాకినాడ రూరల్‌లో పాద‌యాత్ర చేస్తున్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని క‌లుసుకుని ఆయ‌న స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకున్నారు. ఆ త‌ర్వాత నాయి బ్రాహ్మ‌ణులు మీడియాతో మాట్లాడుతూ, త‌మ స‌మ‌స్య‌ల‌పై అనేక సార్లు ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబునాయుడు ద‌గ్గ‌ర‌కు తీసుకు వెళ్లినా ఒక్కసారి కూడా త‌మ‌కు న్యాయం జ‌రగలేద‌ని మండిప‌డ్డారు.
 
పైగా త‌మ సమ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తాన‌ని చెప్పి నాయూ బ్రాహ్మ‌ణుల‌ను ఏపీ స‌చివాల‌యానికి పిలిపించుకుని అవ‌మానించార‌ని విమ‌ర్శ‌లు చేశారు. అందుకే తాము ముఖ్య‌మంత్రికి వ్య‌తిరేకంగా వైసీపీలో చేరి వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ నాయ‌కుల‌కు త‌గిన బుద్ది చెబుతామ‌ని స్ప‌ష్టం చేశారు. అంతేకాదు జ‌గ‌న్ ద‌గ్గ‌ర‌కు నాయి బ్రాహ్మ‌ణులు కొన్ని స‌మ‌స్య‌ల‌ను తీసుకువెళ్తే వాటిపై సానుకూలంగా స్పందించార‌ని అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.