రీ ఎంట్రీకి డేట్ ఫిక్స్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-06 18:25:36

రీ ఎంట్రీకి డేట్ ఫిక్స్

ఉమ్మ‌డి తెలుగు రాష్ట్రాలు చివ‌రి ముఖ్య‌మంత్రి న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డి 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రీ ఎంట్రీ ఇస్తున్నారంటూ సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత‌ కాంగ్రెస్ పార్టీకి గుబై చెప్పి జై స‌మైఖ్యంధ్రా పార్టీని స్థాపించారు. ఆ త‌ర్వాత  2014 సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రిగితే ఆ ఎన్నిక‌ల్లో  పార్టీ త‌ర‌పున అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్టి ఘోర ప‌రాజ‌యాన్ని ఎదుర్కున్నారు.
 
ఆ త‌ర్వాత నుంచి రాజ‌కీయాల‌కు, మీడియా ప్ర‌తినిధుల‌కు దూరంగా ఉంటూ వ‌చ్చారు. ఇక రాష్ట్రంలో నెల‌కొన్న ప‌రిస్థితుల‌ను బట్టి కిర‌ణ్ కుమార్ రెడ్డి ని మ‌ళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకువ‌చ్చేందుకు పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు ఆయ‌న‌తో మంత‌నాలు జ‌రిపారు. ఈ మంత‌నాలు జ‌రిగిన త‌ర్వాత కిర‌ణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు కాస్త‌ స‌మ‌యం ప‌డుతుంద‌ని చెప్పిన సంగ‌తి తెలిసిందే
 
అయితే తాజాగా ఆయ‌న పార్టీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్న‌ట్లు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 13 వ తేదిన రాహూల్ గాందీ స‌మ‌క్షంలో కిర‌ణ్ కుమార్ రెడ్డి  కాంగ్రెస్ పార్టీలో చేర‌నున్నార‌ని చెబుతున్నా