చంద్ర‌బాబుకు త‌ల‌నొప్పిగా మారిన నంద్యాల‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu
Updated:  2018-10-02 12:04:45

చంద్ర‌బాబుకు త‌ల‌నొప్పిగా మారిన నంద్యాల‌

నంద్యాల నియోజ‌క‌వ‌ర్గంలో ముస్లిం మైనార్టీలు, కాపులు,ద‌లితులు, వైశ్యులు ఎక్కువ. అభ్యర్థులు ఎవ‌రు పోటీ చేసినా కూడా గెలుపు ఓట‌మిలు ఈ సామాజిక వ‌ర్గానికి చెందిన వారే నిర్ణ‌యిస్తారు. అయితే ఇటీవ‌లే భూమా నాగిరెడ్డి మ‌ర‌ణం త‌ర్వాత జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో భూమా బ్ర‌హ్మ‌నంద‌రెడ్డి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నిక‌లలో నంద్యాల‌లోవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున గెలిచి ఆ త‌ర్వాత భూమా కుటుంబం అధికార ప్ర‌లోభాల‌కు ఆశ‌ప‌డి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో టీడీపీ తీర్థం తీసుకున్నారు.
 
దీంతో నంద్యాల రాజ‌కీయం మారిపోయింది. నంద్యాల‌లో మంత్రి భూమా అఖిల ప్రియ తెలుగుదేశం పార్టీ నేత సీట్ కార్పోరేష‌న్ చైర్మ‌న్ ఏవీ సుబ్బారెడ్డి మ‌ధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయి. బై ఎల‌క్ష‌న్ల స‌మ‌యంలో వీరిద్ద‌రి మ‌ధ్య తీవ్ర అగాధం ఏర్ప‌డినా అధినాయ‌క‌త్వం జోక్యంతో అప్ప‌ట్లో వీరిద్ద‌రు స‌ర్దుకుపోయారు.  ఈ ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా చేసుకుని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు  ఉప ఎన్నిక‌ల‌కు ముందు నంద్య‌ల కోసం స‌ర్కార్ భారీగా నిధుల‌ను కుమ్మ‌రించింది.  ద‌శాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న రోడ్ల విస్త‌ర‌ణ పూర్తి చేశారు. అలాగే పెద్ద సంఖ్య‌లో ఇళ్లు మంజూరు అయ్యాయి. 
 
ఇక ఈ ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత వీరిద్ద‌రి మ‌ధ్య విభేదాలు ముదిరి నువ్వో నేనో తేల్చుకుందాం అనే దాక వ‌చ్చారు. దీంతో టీడీపీ అధినాయ‌క‌త్వానికి నంద్యాల త‌ల‌నొప్పి ఇప్ప‌టికి పంచాయితీగానే మిగిలిపోయింది. సిట్టంగ్ ఎమ్మెల్యే భూమా బ్ర‌హ్మ‌నంద‌రెడ్డి, ఎస్పీవైరెడ్డి శ్రీద‌ర్ రెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి టికెట్ రేసులో ఉండ‌టంతో నంద్యాల‌లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీకి పెద్ద త‌ల‌నొప్పిగా మారుతోంది. వీరి ముగ్గురిలో ఎవ్వ‌రికి టికెట్ ఫిక్స్ చెయ్య‌లి అనేదానిలో ప‌డింది.
 
ఇక మ‌రోవైపు వ‌చ్చే ఎన్నిక‌ల్లో నంద్యాల‌ నుంచి వైసీపీ అభ్య‌ర్ధిగా శిల్పా మోహ‌న్ రెడ్డి కుమారుడు ర‌విచంద్ర కిశోర్ రెడ్డి పోటీ దాదాపుగా ఖాయం అయింది. నంద్యాల‌లో సిల్పా మోహ‌న్ రెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా తెలిచి వైఎస్ హ‌యాంలో మంత్రి వ‌ర్గంలో కూడా ఉన్నారు ఆయ‌న‌.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.