చంద్ర‌బాబు మ‌రో చీటింగ్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-01 15:15:27

చంద్ర‌బాబు మ‌రో చీటింగ్

* కాపుల‌కు ప్ర‌తీ ఏట 1000 కోట్టు 
* గ‌త ఎన్నిక‌ల మేనిఫెస్టోలో చెప్పిన టీడీపీ 
* నాలుగేళ్ల‌లో ఇవ్వాల్సింది నాలుగు వేల కోట్లు
*  ఇచ్చింది 909 కోట్లు మాత్ర‌మే
* ఇప్పుడు మంత్రులు , ముఖ్య‌మంత్రి చెప్పేవి అన్ని భోగ‌స్ లెక్క‌లే
 
కాపు ఓట్ల కోసం గ‌త ఎన్నిక‌ల్లో చెప్పిన మాటల‌ను ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు నీటి మూట‌లుగా మార్చేశారు. కాపుల రిజ‌ర్వేష‌న్ల‌తో పాటు కాపు కార్పోరేష‌న్ ద్వారా ప్ర‌తీ ఏట వెయ్యి కోట్లు కాపుల సంక్షేమం కోసం ఖ‌ర్చుపెడుతాన‌ని, హామీ ఇచ్చారు. అయితే నాలుగేళ్లు క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు వెయ్యి కోట్లు కూడా ఖ‌ర్చు చెయ్య‌లేదంటే కాపుల‌ను టీడీపీ స‌ర్కార్ ఎంత దారుణంగా మోసం చేసిందో క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టినా అట్టే తెలిసిపోతుంది. 
 
2014 నుంచి 2018 వ‌ర‌కు 2100 కోట్ల రూపాయ‌లు ఇస్తామ‌ని బ‌డ్జెట్ లో చూపించిన ప్ర‌భుత్వం అస‌లు కాపుల‌కు ఖ‌ర్చు చేసింది 909 కోట్లే. కాపుల‌కు ఉపాధి క‌ల్పించేందుకు విద్య‌, ఉద్యోగ అవ‌కాశాల శిక్ష‌ణ‌ల కోసం కాపు కార్పోరేష‌న్ ద్వారా స‌హాయం చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు హామీ ఇచ్చారు. 
 
ఇక 2014లో ముఖ్య‌మంత్రి అయ్యాక తొలి ఏడాది నుంచే ఒక్క రూపాయి కూడా కాపులకు ఇవ్వ‌లేదు. అయితే ఈ క్ర‌మంలో కాపు ఉద్య‌మం ఉద్రిక్తం అయ్యాక రెండో ఏడాది కేవలం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వంద కోట్ల‌ను మాత్ర‌మే విడుద‌ల చేశారు. అయితే అందులో 74 కోట్లను ఖ‌ర్చు చేసి 2016-17 ఆర్థిక సంవ‌త్స‌రం బ‌డ్జెట్ లో వెయ్యి కోట్లు కేటాయించామ‌ని చూపించారు. 
 
కానీ స‌ర్కార్ ఆ ఏడాది విడుద‌ల చేసిది 302 కోట్లు మాత్ర‌మే ఇక 2017-18 ఆర్థిక సంవ‌త్స‌రంలో వెయ్యి కోట్లు ఇస్తామ‌ని బ‌డ్జెట్ లో చూపించారు తెలుగు త‌మ్ముళ్లు. అయితే వాస్త‌వానికి ఈ సంవ‌త్స‌రం ఇచ్చింది 532 కోట్లు మాత్ర‌మే. గ‌త ప్ర‌భుత్వాల నుండి పెండింగ్ లో ఉన్న స్కాల‌ర్ షిప్ డ‌బ్బులు 263 కోట్ల‌ను ఇందులో క‌లిపి టీడీపీ నాయ‌కులు లెక్క‌ల‌ను చూపించేశారు. 
 
అయితే ఈ లెక్క ప్ర‌కారం చూస్తే 269 కోట్లు మాత్ర‌మే ఖ‌ర్చు చేశారు. ఇక ఈ ఏడాది చూపించిన వెయ్యి కోట్లలో 400 కోట్లు స్కాల‌ర్ షిప్ నిధుల‌ను క‌లిపి ఆరు వంద‌ల‌కోట్ల‌కు టీడీపీ నాయ‌కులు ప‌రిమితం చేశారు. ముఖ్య‌మంత్రి చెప్పిన‌ మాట‌ల‌న్ని అబ‌ద్దాలే అని ఈ  అంకేలే సాక్షాలుగా నిరూపిస్తున్నాయి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.