చంద్ర‌బాబు వీరిద్ద‌రికి చెక్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu naidu
Updated:  2018-11-06 12:25:47

చంద్ర‌బాబు వీరిద్ద‌రికి చెక్

నాటినుంచి నేటివ‌ర‌కు తెలుగుదేశం పార్టీని న‌మ్ముకుని ఉన్న ఉప ముఖ్య‌మంత్రి కేఈ కృష్ణ మూర్తికి అలాగే మ‌రో మంత్రి అయ్య‌న్న పాత్రుడుకి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు చెక్క పెట్టారా అంటే అవుననే అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. కొద్దిరోజుల క్రితం చంద్ర‌బాబు నాయుడు వ‌చ్చే ఎన్నికల్లో తెలంగాణ‌తో నాటు ఏపీలో కూడా జాతీయ కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకుని పోటీ చేస్తార‌ని వార్త‌లు వ‌చ్చాయి.
 
ఇక ఈ విష‌యంపై స్పందించిన కేఈ కృష్ణ‌మూర్తి నంద‌మూరి తార‌క‌రామారావు కాంగ్రెస్ పార్టీకి వ్య‌తిరేకంగా స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అలాంటి పార్టీని ఇప్పుడు చంద్ర‌బాబు నాయుడు ఇదే పార్టీతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తు కుదుర్చుకుంటే తాను ఉరి వేసుకుంటాన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇక మ‌రో మంత్రి అయ్య‌పాత్రుడు ఇదే స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. వ‌చ్చే ఎన్నికల్లో టీడీపీ-కాంగ్రెస్ పార్టీతో ఏపీలో పొత్తు కుదుర్చుకుంటే రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రూ కొడ‌తార‌ని అంతేకాదు తాను పార్టీకి రాజీనామా చేస్తాన‌ని అన్నారు. 
 
అయితే ఇటీవ‌లే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు హ‌స్తిన సాక్షిగా కాంగ్రెస్ తో పొత్తు కుదుర్చుకోవ‌డం తో వీరిద్ద‌రు స్వ‌రం మార్చుకున్నారు. పార్టీ సిద్దాంతాల‌క‌న్నా ప్రజా శ్రేయ‌స్సే ముఖ్యం అని చెప్పి త‌ప్పించుకున్నారు. ఇక వీరిద్ద‌రు త‌ప్పించుకోవ‌డం వెనుక బ‌ల‌మైన కార‌ణం ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. ప్ర‌స్తుతం ప‌త్