ప‌వ‌న్ పై చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-17 12:23:15

ప‌వ‌న్ పై చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబుకు ఇంత‌వ‌ర‌కూ  ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని మాత్ర‌మే టార్గెట్ చేస్తూ వ్యాఖ్య‌లు చేసేవారు... కానీ బాబు నిర్ల‌క్ష‌మో, లేక ఆయ‌న చేస్తున్న ప‌రిపాల‌న న‌చ్చ‌కో  కానీ మిత్ర ప‌క్షంగా ఉన్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ బాబుపై అలాగే తెలుగు దేశం నాయ‌కుల‌పై గుంటూరు ప్లీన‌రీ వేదిక‌గా చేసుకుని సంచ‌ల‌న కామెంట్లు చేశారు.. రాష్ట్ర వ్యాప్తంగా అధికార అండ‌తో అవినీతి అరాచ‌కాల చేస్తున్నారంటూ ప‌వ‌న్ విమ‌ర్శించారు.. దీంతో తెలుగు దేశం నాయ‌కుల అవినీతి గుట్టుర‌ట్టుకావ‌డంతో ఏపీఅంతా ప‌వ‌న్ వ్యాఖ్య‌లు తెలుగుదేశం తిప్ప‌లు చ‌ర్చించుకుంటున్నారు.
 
అయితే తాజాగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై స్పందించారు... ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ.. ప్ర‌శ్నించ‌డానికే పార్టీని స్థాపించాను అంటున్న  ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇంత‌వ‌ర‌కూ  కేంద్రాన్ని ఒక్క‌సారైనా ప్ర‌శ్నించారా?  అని మండిప‌డ్డారు బాబు... రాష్ట్రం మొత్తం ప్ర‌త్యేక హోదా కావాల‌ని కోరుకుంటుంటే ప‌వ‌న్ మాత్రం ఫ్యాక్ట్ ఫైండింగ్ పేరుతో అమాయ‌క ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెడుతున్నార‌ని, ఈ క‌మిటీ ఒక వేస్ట్ క‌మిటీ అన్నారు చంద్ర‌బాబు.
 
రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరంతరం శ్రమిస్తున్న తనకు మద్దతుగా నిలవాల్సింది పోయి... ఫ్యాక్ట్ ఫైండింగ్ అంటూ అడ్డంకులు కలిగించడం ఏంటని బాబు ప్ర‌శ్నించారు.. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కేంద్రాన్ని నిలదీయకుండా మధ్యవర్తులుగా ఉండటానికి వీరెవరు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.... అంతే కాకుండా ప్ర‌ధానితో మాట్లాడ‌కుండా త‌న‌గురించి  ఫ్యాక్ట్ ఫైండింగ్ క‌మిటీ ఎలా వేస్తార‌ని, రాష్ట్రంలో అల‌జ‌డి సృష్టించి కేంద్రానికి మేలు చేయాల‌ని ప‌వ‌న్ భావిస్తున్నార‌ని చంద్రబాబు అన్నారు.
 
అందులో భాగంగానే ఎంత‌టి రాజ‌కీయ అనుభ‌వ‌జ్ఞుడు అయినా ఏదో ఒక చోట చిన్న పోర‌పాట్లు జ‌రుగుతూనే ఉంటాయ‌ని, అలాంటిదే ఇసుక విక్రయాలకు సంబంధించి ఒకటి, రెండు చిన్నచిన్న పొరపాట్లు జ‌రిగాయ‌ని చంద్ర‌బాబు అన్నారు ...ఈ చిన్న పొర‌పాటుకు త‌న‌ను  మైనింగ్ స్కామ్ అంటూ గాలి జనార్దన్ రెడ్డితో ముడిపెట్ట‌డం స‌రికాద‌ని  అన్నారు. ఇప్ప‌టికైనా ప‌వ‌న్ క‌ల్యాణ్ వాస్త‌వాల‌ని  గ‌మ‌నించి ఎవ‌రు అవినీతి ప‌రులో తెలుసుకుని మాట్లాడాల‌ని చంద్ర‌బాబు తెలిపారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.