గెలిస్తే దావోస్ యాత్ర‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-09 16:41:48

గెలిస్తే దావోస్ యాత్ర‌

వ‌స్తున్నా మీ కోసం అంటూ అనంత‌లో అంకురార్ప‌ణ చేసి కర్నూలు, పాలమూరు, రంగారెడ్డి, మెదక్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, కష్ణా, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో పాద‌యాత్ర చేశారు చంద్ర‌బాబు..ఇక పాద‌యాత్ర ఎఫెక్ట్ తో అధికారంలోకి వచ్చాము అని చెబుతారు ఏపీ విభ‌జ‌న వ‌ల్ల కాంగ్రెస్ ఓడిపోయింది అంటే దానిని ఖండిస్తారు కొంద‌రు.
 
ఏపీలో సీనియ‌ర్ దేశంలో ఇంత సీనియ‌ర్ ఎవ‌రూ లేరు అని అంద‌రూ ఓట్లు వేశారు చంద్ర‌బాబుకు గ‌త ఎన్నిక‌ల్లో.. ఓ ప‌క్క బీజేపీ మ‌రో ప‌క్క జ‌న‌సేన‌తో 40 శాతం ఓట్లు డైవ‌ర్ట్ చేయించుకున్న బాబు, ఇప్పుడు ఇద్ద‌రికి శ‌త్రువు అయ్యారు. బాబు పాల‌న‌లో అవినీతి తాండ‌వం చేసింది అని ఇక బాబు పాల‌న‌తో మాకు ఆ మ‌ర‌క అంటుకుంటోంది అని బీజేపీ పొమ్మ‌నలేక పొగ‌పెట్టింది... తెలుగుదేశం ఆ పొగ త‌ట్టుకోలేక బ‌య‌ట‌కు వ‌చ్చేసింది ఎన్టీయే నుంచి.
 
ఇక బాబు పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి తెలుగుదేశం నాయ‌కుల చేత బీజేపీపై విమ‌ర్శ‌లుచేయ‌డం అభాండాలు వేయ‌డం చేస్తున్నారు... ఈ నాలుగు సంవ‌త్స‌రాలు కాపురం చేసిన బీజేపీ పై ఎందుకు విమ‌ర్శ‌లు చేస్తున్నారు?  నాడు అరుణ్ జైట్లీ ఏం చ‌దివారో అదే పేప‌ర్ రీసెంట్ మీటింగులో చ‌దివారు... ఆనాడుఎందుకు బాబు నోరు మొద‌ప‌లేదు అని మేధావులు ప్ర‌శ్న‌?
 
ఇక బాబు రాజ‌కీయం చూస్తే అధికారం కోసం 2012 లో పాద‌యాత్ర చేశారు... అయితే మండుటెండ‌లో జ‌రిగిందా ఎప్పుడు జ‌రిగింది అనేది అంద‌రికి తెలిసిందే అది అక్టోబ‌ర్ లో యాత్ర‌. ఇక బాబు ఓట‌మిపాలైతే పాద‌యాత్ర‌లు చేయ‌డం, ఇప్పుడు గెలిచిన త‌ర్వాత ప్ర‌జా ధ‌నంతో దావోస్ యాత్ర‌లు చేయ‌డం ఏమిటని ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు..?
 
అస‌లు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన త‌ర్వాత ఏపీలో చెప్పుకోద‌గ్గ ప‌దిప‌థ‌కాలు చెప్పండి అని ప్ర‌శ్నిస్తున్నారు. అస‌లు ఎవ‌రు  దావోస్ వెళ్ల‌మంటున్నారు, అక్క‌డ‌కు వెళ్లినా ఎటువంటి పెట్టుబ‌డులు ఏపీకి వ‌చ్చాయో ఓ శ్వేత పత్రం విడుద‌ల చేయాలి అని, అలాగే మీకు విదేశీ ప‌ర్య‌ట‌న‌కు ఎంత ఖ‌ర్చు అయిందో తెలియ‌చేయాలి అని ప్ర‌శ్నిస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.