ఫిరాయింపు ఎమ్మెల్యేపై చంద్ర‌బాబు ఫైర్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-29 15:08:58

ఫిరాయింపు ఎమ్మెల్యేపై చంద్ర‌బాబు ఫైర్

ఏపీ ముఖ్యంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు 2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో ప్ర‌తీ జిల్లాకు ప‌ర్య‌టించి జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలను విడివిడిగా క‌లుసుకుని త‌మ నియోజ‌క‌వ‌ర్గంపై టీడీపీ ప‌ట్టు ఏవిధంగా ఉందోన‌ని అడిగి తెలుసుకుంటున్నారు.అయితే ఇటీవ‌లే చంద్ర‌బాబు నాయుడు ప్ర‌కాశం జిల్లాలో ప‌ర్య‌టించి టీడీపీ ఎమ్మెల్యేల‌తో విడివిడిగా భేటీ అయ్యార‌ట‌. ముందుగా య‌ర్ర‌గొండ‌పాలెం ఫిరాయింపు ఎమ్మెల్యే డేవిడ్ రాజుతో ముఖ్య‌మంత్రి భేటీ అయ్యారు. 
 
ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ నాయ‌కులు మ‌ధ్య‌ ప్ర‌తీ మండ‌లంలో విభేదాలు ఉన్నాయ‌ని అవి స‌రిచేయ‌కుండా ఏం చేస్తున్నార‌ని డేవిడ్ రాజు పై చంద్ర‌బాబు నాయుడు ఫైర్ అయ్యార‌ట‌. అంతేకాదు చంద్ర‌బాబు నాయుడు త‌న ద‌గ్గ‌ర ఉన్న నివేధిక‌ను చూస్తూ య‌ర్ర‌గొండ‌పాలెం నియోజ‌క‌ర్గంలో అవినీతి ఎక్కువ జ‌రుగుతోంద‌ని ముఖ్య‌మంత్రి ఫైర్ అయ్యార‌ట‌. 
 
అలాగే మాజీ జ‌డ్పీ వైస్ చైర్మ‌న్ డాక్ట‌ర్ ర‌వీంద్ర కొద్ది కాలంగా పార్టీకి ఎందుకు దూరంగా ఉన్నార‌ని వాటి కార‌ణాలు చంద్ర‌బాబు అడిగి తెలుసుకున్నారు. ఈ జిల్లాలోని అన్ని నియోజ‌క‌ర్గాల‌తో పోలిస్తే య‌ర్ర‌గొండ‌పాలెం నియోజ‌క‌వ‌ర్గంలో ఎక్కువ అవినీతి, పార్టీ నాయ‌కుల మ‌ధ్య వ‌ర్గ విభేదాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని చంద్ర‌బాబు హెచ్చ‌రించార‌ట‌. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో ఏ గ్రామంలో కూడా వ‌ర్గ విభేదాలు లేకుండా చూసుకోవాల‌ని డేవిడ్ రాజుకు చంద్ర‌బాబు సూచించార‌ట‌. 
 
ఇక చివ‌రిగా ఈ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ గెలుపు ఎంత‌మేర‌కు ఉంద‌ని చంద్ర‌బాబు సూటిగా ప్ర‌శ్నించార‌ట‌. అయితే అందుకు డేవిడ్ స‌మాధానం ఇవ్వ‌కుండా ఆయ‌న సొంత గ్రామం వెళ్లె అవ‌కాశం క‌ల్పించాల‌ని చంద్ర‌బాబును కోరార‌ట‌. దీనిని బ‌ట్టి చూస్తుంటే డేవిడ్ త‌న నియోజ‌క‌వ‌ర్గానికి  వెళ్లాల‌ని అడిగారంటే ప‌రోక్షంగా ఆయ‌న ఓట‌మి చెందుతాన‌ని చెప్ప‌క‌నే చెప్పిన‌ట్లు అయింది. చూద్దాం ఎన్నిక‌లకు ఇంకాచాలా స‌మ‌యం ఉంది ఈ లోపు య‌ర్ర‌గొండ‌పాలెం నియోజ‌క‌వ‌ర్గంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయే.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.