వాజ్ పేయికి నాకు అనుబంధం ఇలా కుదిరింది

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-17 13:54:53

వాజ్ పేయికి నాకు అనుబంధం ఇలా కుదిరింది

మజీ ప్ర‌ధామంత్రి అట‌ల్ బిహారీ వాజ్ పేయి మ‌రణ వార్త విన‌గానే ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు హుటా హుటీన ఢిల్లీలోని వాజ్ పేయి నివాసానికి చేరుకున్నారు. ఆయ‌న పార్దీవ దేహానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతిని తెలిపారు. ఆ త‌ర్వాత చంద్ర‌బాబు నాయుడు గతంలో వాజ్ పేయితో ఉన్న స‌న్నిహిత సంబంధాన్ని మీడియా ద్వారా గుర్తు చేసుకున్నారు. 
 
ఆయ‌న భార‌త ప్ర‌ధానిగా ఉన్న స‌మ‌యంలో తాను ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా ఉన్నాన‌ని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు. ఆయ‌న‌ రాష్ట్రంలో ఏ కార్య‌క్ర‌మం చేసినా కూడా పూర్తిగా స‌హ‌క‌రించేవారని తెలిపారు. వాజ్ పేయి ప్ర‌ధానిగా ఉన్న‌ప్పుడు రాష్ట్రంలో అనేక అభివృద్ది కార్య‌క్ర‌మాలు జ‌రిగాయ‌ని చంద్ర‌బాబు గుర్తు చేశారు. అంతేకాదు, 1998లో తాను హైద‌రాబాద్ లో హైటెక్ సిటిని నిర్మిస్తే ప్రారంభోత్స‌వానికి వాజ్ పేయి రావాల‌ని ఆహ్వానిస్తే ఆయ‌న వ‌చ్చార‌ని తెలిపారు. 
 
తాను అడ‌గ్గానే హైద‌రాబాద్ కు ఎంఎంటీఎస్ ను శంశాబాద్ ఎయిర్ పోర్టును మంజూరు చేశార‌ని చంద్ర‌బాబు అన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్ది కోసం పెద్ద పీఠ వేశార‌ని అన్నారు. అటువంటి మ‌హానేతను కోల్పోవ‌డం దే