బ్రేకింగ్ 2019 ఎన్నిక‌ల‌కు మొద‌టి ఎమ్మెల్యే, ఎంపీ అభ్య‌ర్థిల‌ను ప్ర‌క‌టించిన లోకేశ్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-09 18:20:36

బ్రేకింగ్ 2019 ఎన్నిక‌ల‌కు మొద‌టి ఎమ్మెల్యే, ఎంపీ అభ్య‌ర్థిల‌ను ప్ర‌క‌టించిన లోకేశ్

ఏపీ అధికార తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కుమారుడు మంత్రి నారాలోకేశ్ బాబు 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు టీడీపీ త‌ర‌పున అభ్య‌ర్థుల‌ను ప్ర‌కటించారు. ఈ రోజు రాయ‌ల‌సీమలోని క‌ర్నూల్ జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా జిల్లా టీడీపీ నాయ‌కులు బ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేశారు.
 
ఈ స‌భ‌లో మంత్రి నారాలోకేశ్ మాట్లాడుతూ, 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో క‌ర్నూల్ జిల్లా నుంచి టీడీపీ త‌ర‌పున ఎమ్మెల్యేగా ఎస్వీ మోహ‌న్ రెడ్డి పోటీ చేస్తార‌ని స‌భా ముఖంగా 2019 ఎన్నిక‌ల‌కు మొద‌టి అభ్య‌ర్ధిని ప్ర‌క‌టించారు. అలాగే క‌ర్నూల్ పార్ల‌మెంట్ ప‌రిధిలో ఉన్న ఒక్క ఎంపీ సీటుకు బుట్టా రేణుక‌ పోటీ చేస్తార‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు.
 
ఇక ఆయ‌న ప్ర‌క‌టించిన అభ్య‌ర్థుల‌పై టీజీ  ఫ్యామిలీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఎందుకంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున టీజీ వెంక‌టేష్ త‌న కుమారుడు టీజీ భ‌ర‌త్ ను క‌ర్నూల్ అర్భ‌న్ నుంచి పోటీ చేయించాల‌ని చూస్తున్నారు. ఇందు కోసం క‌ర్నూల్ జిల్లాలో భ‌ర‌త్ పేరిట యువ సంఘాల‌ను త‌యారు చేసి ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేస్తున్నారు ఈ క్ర‌మంలో లోకేశ్ క‌ర్నూల్ అభ్య‌ర్ధిని ప్ర‌కటించ‌డంతో సీమ‌రాజ‌కీయాలు ర‌గులుతున్నాయి. చూద్దాం ఏం జ‌రుగుతుందో.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.