ఇది ఫైన‌ల్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-12 12:57:03

ఇది ఫైన‌ల్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు మంత్రి నారా లోకేష్ 2019 ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌త్య‌క్ష  ఎన్నిక‌ల్లో ఒక్క సారి కూడా ఎన్నిక కాలేదు లోకేష్ . ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికై మంత్రి ప‌ద‌విలో కొన‌సాగుతున్నారు.
 
అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో మాత్రం ప్ర‌జా తీర్పుతోనే ప‌ద‌విని  చేప‌ట్టేందుకు సిద్ద‌మైన్న‌ట్లు తెలుస్తోంది. లోకేష్ పోటీ పై అనేక వార్త‌లు తెర‌పైకి వ‌చ్చాయి.  కృష్ణా, గుంటూరు జిల్లాలో ఏదైనా అసెంబ్లీని ఎంపిక చేసుకునే అవ‌కాశం ఉంద‌నే ప్ర‌చారం జ‌రిగింది. అయితే సొంత జిల్లా చిత్తూరు నుండే పోటీ చేసేందుకు లోకేష్  సిద్ద‌మైన‌ట్లు స‌మాచారం. 
 
లోకేష్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తానంటే త‌న సీటును ఇచ్చేందుకు సిద్ద‌మ‌ని మంత్రి అమ‌ర్ నాధ్ రెడ్డి ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. గ‌త ఎన్నిక‌ల్లో  పలమనేరు నుంచి పోటీ చేసిన అమ‌ర్ నాధ్ రెడ్డి వ‌చ్చే సారి పుంగ‌నూరుకు జంప్ అయ్యేందుకు సిద్ద‌మ‌య్యారు. 
 
ఈ క్ర‌మంలో మంత్రి నారా లోకేష్ చిత్తూరు జిల్లా నుండే పోటీ చేసేందుకు సిద్ద‌మయ్యారు. ఇందుకు సంబంధించి పార్టీ అధిష్టానం గ్రౌండ్ వ‌ర్క్ కూడా పూర్తి చేసింద‌ని అధికార పార్టీ అనుకూల మీడియా  ఓ క‌థ‌నంలోపేర్కొంది. అయితే ఏ నియోజ‌క‌వర్గం నుండి పోటీ చేస్తార‌నేది మాత్రం ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.