చినబాబు అక్క‌డి నుంచే పోటీ ఫిక్స్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-03 18:36:09

చినబాబు అక్క‌డి నుంచే పోటీ ఫిక్స్

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు కుమారుడు మంత్రి నారాలోకేశ్ కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీటు క‌న్ఫామ్ అయిన‌ట్లు తెలుస్తోంది. గతంలో ప్ర‌త్య‌క్ష రాజ‌కీయ‌ అరంగేట్రం చేయ‌కుండా ప‌రోక్షంగా ఎమ్మెల్సీ అయ్యారు చిన‌బాబు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల భ‌రిలోకి దిగాల‌నే ఉద్దేశంతో లోకేశ్ బాబు క‌ఠిన‌మైన నిర్ణ‌యం తీసుకున్నారు. అందులో భాగంగానే లోకేశ్ టీడీపీకి అనుకూలంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాన్ని ఎంపిక చేసేప‌నిలో ఉన్నార‌ని గ‌తంలో వార్త‌లు వ‌చ్చాయి.
 
అయితే ముందుగా లోకేశ్ త‌న సొంత జిల్లా చిత్తూరు జిల్లా చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని భావించారు. కానీ ఇక్కడ వైసీపీకి గ‌ట్టి స‌పోర్ట్ ఉంది.  2014 ఎన్నిక‌ల్లో రాజ‌కీయ సీనియ‌ర్ నాయ‌కురాలు గ‌ల్లా అరుణ కుమారి టీడీపీ త‌ర‌పున పోటీ చేసి త‌న ప్ర‌త్య‌ర్థిపై ఘోర ప‌రాజ‌యం ఎదుర్కొన్నారు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీనే గెలుస్తుంద‌ని గ్ర‌హించి లోకేష్ బాబు వేరే నియోజ‌క‌వ‌ర్గం వైపు మ‌కాం మార్చారు.
 
తాజా స‌మాచారం ప్ర‌కారం లోకేశ్ బాబు కృష్ణా జిల్లా గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయ‌నున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. గ‌న్నవ‌రం అయితే త‌నకు సేఫ్ జోన్ అని భావించి ఈ నియోజ‌క‌వ‌ర్గాన్ని ఎంపిక చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ హయాం నుంచి నేటి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు వ‌ర‌కు టీడీపీకి మ‌ద్ద‌తుగానే నిలుస్తోంది గ‌న్న‌వ‌రం. పైగా టీడీపీ హయంలో ప‌ట్టిసీమ ఫ‌లాలు కూడా ఈ నియోజ‌క‌వ‌ర్గానికి ఎక్కువ‌గా అందాయి.
 
దీంతో రైతులు కూడా టీడీపీ ప్ర‌భుత్వానికి సానుకూలంగా మ‌ద్ద‌తు ఇస్తార‌నే ఉద్దేశంతో లోకేశ్ గ‌న్న‌వ‌రం నియోజ‌కవ‌ర్గాన్ని ఎంపిక చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గాన్ని ఫైన‌ల్ చేయ‌క ముందు పెన‌మ‌లూరు నియోజ‌క‌వ‌ర్గం వైపు లోకేశ్ దృష్టి సాధించారు. కానీ అక్క‌డ టీడీపీకి 50-50 ఛాన్సస్ ఉన్నాయ‌ని తెలియ‌డంతో చివ‌రికి గ‌న్న‌వ‌రంను ఫిక్స్ చేసిన‌ట్లు తెలుస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.