విష్ణుకుమార్ రాజుకు నారా లోకేష్ ఆఫ‌ర్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-07 02:47:52

విష్ణుకుమార్ రాజుకు నారా లోకేష్ ఆఫ‌ర్

ప్ర‌పంచ స్థాయి రాజ‌ధాని నిర్మిస్తామ‌ని చెప్ప‌డంలో తెలుగుదేశం స‌ర్కార్ అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పోందింది. అయితే అధికారంలోకి వ‌చ్చి నాలుగు సంవ‌త్స‌రాలు పూర్తి అయినా,  క‌నీసం రాష్ట్ర‌ రాజ‌ధానికి డిజైన్ల‌ను ఖ‌రారు చేయ‌లేదు అధికార పార్టీ... రాష్ట్ర‌ రాజ‌ధాని అమ‌రావ‌తిలో ఉండి పాల‌న చేయ‌డానికి తాత్కాలిక ప‌రిపాల‌న భ‌వ‌నాల‌ను ఏర్పాటు చేసింది ఏపీ స‌ర్కార్... అయితే ఈ నూత‌న భ‌వ‌నాలు పూర్తి స్తాయి సామ‌ర్ధ్యంతో, స‌రైన ప్ర‌మాణాలు పాటించి నిర్మించ‌క పోవ‌డంతో వ‌ర్షాల‌కు లీకులు ఏర్ప‌డి, వాట‌ర్ ఫాల్స్ ను త‌ల‌పించాయి..ఇది ప‌లు మీడియాల‌లో కూడా వార్త‌లు వ‌చ్చాయి, సోష‌ల్ మీడియాలో ఈ న్యూస్ ట్రెండింగ్ అయింది.
 
అయితే  తాజాగా రాష్ట్ర మంత్రి నారా లోకేష్, బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు ఇరువురు క‌లిసి చ‌ర్చించుకున్నారు. నారా లోకేష్ శాసనమండలికి వెళ్తున్న స‌మ‌యంలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు స‌చివాల‌యంలో త‌నకు కేటాయించిన కార్యాల‌యానికి లోకేష్‌ను తీసుకెళ్లారు. మా కార్యాలయం లోపల ఎన్ని యాంగిల్స్ ఉన్నాయో చూడండి, అలాగే మా కార్యాలయానికి వాస్తు బాగోలేదని విష్ణుకుమార్ రాజు మంత్రి నారా లోకేష్‌కు తెలియ‌జేశారు.
 
దీనికి స్పందించిన మంత్రి లోకేష్ ఈ కార్యాలయం న‌చ్చ‌కపోతే నా కార్యాలయానికి  వెళ్లండి... నేను బీజేపీ ఎల్పీ కార్యాలయాన్ని వినియోగించుకుంటాన‌ని విష్ణుకుమార్ రాజుకు లోకేష్ తెలిపారు. దీనికి వద్దు సార్ మీరు మంత్రులు, మీరు మా కార్యాలయంలో ఎలా వుంటారని విష్ణుకుమార్ రాజు మంత్రి లోకేష్‌కు బ‌దులిచ్చారు.. ప్ర‌స్తుతం టీడీపీ-బీజేపీ మ‌ధ్య జ‌రుగుతున్న వార్ నేప‌థ్యంలో ఇలాంటి సంఘ‌ట‌న చోటు చేసుకోవ‌డం దేనికి దారి తీస్తుందో చూడాలి.ఇక చేసిన త‌ప్పును అనుభ‌వించాల్సిన బాధ్య‌త తీసుకోవ‌డం అంటే ఇదేనేమో మ‌రి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.