కేసీఆర్ అక్ర‌మ సంబంధం కొన‌సాగిస్తున్నారు లోకేశ్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

telangana cm kcr and nara lokesh
Updated:  2018-09-08 12:11:20

కేసీఆర్ అక్ర‌మ సంబంధం కొన‌సాగిస్తున్నారు లోకేశ్

తెలంగాణ‌ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ముంద‌స్తు ఎన్నిక‌లకు సిద్ద‌మ‌వుతున్న త‌రుణంలో ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు కుమారుడు నారా లోకేశ్ ప‌లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేసీఆర్ అధికారంలోకి వ‌చ్చిన నాలుగు సంవ‌త్స‌రాలు అయినా ఫ‌లానా అభివృద్ది చేశామ‌ని దైర్యంగా చెప్పుకోవ‌డాని స‌మాధానం ఉందా అని ఆయ‌న ప్ర‌శ్నించారు.
 
గ‌డువు ముగియ‌క‌ముందే ముఖ్య‌మంత్రి కేసీఆర్ ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రప‌డం బాధాక‌రం అని ఎన్నిక‌ల ప్ర‌చారంలో కేసీఆర్ ప్ర‌జ‌ల‌కు ఏం స‌మాధానం ఇస్తారు అని ప్ర‌శ్నించారు. అంతేకాదు అర్థాంత‌రంగా  అసెంబ్లీని ర‌ద్దు చేయ‌డం దారుణం అని లోకేశ్ అన్నారు.
 
టీఆర్ఎస్, బీజేపీల మ‌ధ్య అక్ర‌మ సంబంధం ఉంద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేసీఆర్ బీజేపీతో అక్ర‌మ‌ సంబంధం కొన‌సాగిస్తూనే త‌మ‌కు ఎంఐఎంతో మిత్ర‌ప‌క్షం ఉంద‌ని ప్ర‌చారం చెయ్య‌డం విడ్డూరంగా ఉంద‌ని లోకేశ్ ఆరోపించారు.

షేర్ :